USA: హార్వర్డ్ లో విదేశీ విద్యార్థులకు నో ఎంట్రీ..ట్రంప్ కొత్త రూల్

హార్వర్డ్ లో ఇక మీదట విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి వీలు లేదంటూ అమెరికా ప్రభుత్వం నిషేధం పెట్టింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విశ్వవిద్యాలయంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా దీన్ని అమలు చేస్తామని తెలిపింది. 

New Update
usa

Trump VS Harvard

అమెరికా ప్రభుత్వానికి, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఉన్న గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు హార్వర్డ్ మీద పగబట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. తాను చెప్పినట్టు వినలేదని ఇప్పటికే పలు ఆంక్షలు పెట్టిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా యూనివర్శిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి వీలు లేదంటూ రూల్ ను పెట్టింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విశ్వవిద్యాలయంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా దీన్ని అమలు చేస్తామని చెబుతోంది. దీనికి సంబంధించి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ విశ్వవిద్యాలయానికి ఒక లేఖ కూడా పంపారు. 

ప్రభుత్వ వ్యతిరేకత వల్లనే..

ఈ లేఖలో హార్వర్డ్ యూనివర్శిటీ పరిపాలనకు వ్యతిరేకంగా హింసను ప్రోత్సహిస్తోందని చెప్పారు. యూదు వ్యతిరేకతను పెంపొందించడం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో చేతులు కలపడం లాంటి వాటిని యూనివర్శిటీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దాంతో పాటూ విదేశీ విద్యార్థుల నుంచి అధిక ఫీజులను వసూలు చేస్తోందని కూడా ఆరోపించారు. ఒకవేళ రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ముందు హార్వర్డ్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్‌ను తిరిగి పొందాలనుకుంటే, వారు "72 గంటల్లోపు" "అవసరమైన సమాచారాన్ని ముందుగానే తెలపాలని...అప్పుడు తాము అనుమతి ఇస్తేనే చేయాలని చెప్పారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం వలన  ఇప్పటికే చదువుతున్న విద్యార్థులు ఇతర పాఠశాలలకు బదిలీ కావాల్సి వస్తుందని లేదా వారి చట్టపరమైన హోదాను కోల్పోవాల్సి వస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. 

అయితే ట్రంప్ ప్రభుత్వం చేసిన ఈ నిషేధం వలన యూనివర్శిటీకి తీవ్రమైన హాని కలిగిస్తుందని హార్వర్డ్ అధికారులు అంటున్నారు. 140 కంటే ఎక్కువ దేశాల నుంచి ఇక్కడ విద్యార్థులు, టీచర్లు వస్తారని చెప్పారు. కానీ అమెరికా ప్రభుత్వం నిషేధాన్ని తాము అమలు చేయమని...విదేశీ విద్యార్థులను చేర్చుకుని తాము దేశాన్ని సుసంపన్నం చేస్తామని చెబుతున్నారు. 

ఇంతకు ముందు నుంచి ట్రంప్ హార్వర్డ్ యూనివర్శిటీలకు మధ్యన గొడవ కొనసాగుతోంది. ఆ యూనివర్సిటీకి సంబంధించి $2.2 బిలియన్ గ్రాంట్లు, $60 మిలియన్ కాంట్రాక్టులను (రూ. 19,000 కోట్ల గ్రాంట్లు, కాంట్రాక్టులు) నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. యూనివర్సిటీలో క్యాంపస్ యాక్టివిజం నియంత్రణ, మెరిట్-బేస్డ్ అడ్మిషన్స్, డైవర్సిటీ వీక్షణల ఆడిట్ చేయాలని ఇటీవల ట్రంప్ డిమాండ్ చేశారు. కానీ ఇందుకు హార్వర్డ్‌ యూనివర్సిటీ తిరస్కరించింది. అప్పటి నుంచి యూనివర్శిటీ మీద ఏదో ఒక చర్యల తీసుకుంటూనే ఉన్నారు. 

 today-latest-news-in-telugu | usa | trump | university

Also Read: Rains: రెండు వైపుల నుంచి ముంచుకొస్తోంది..అరేబియాలో వాయుగుండం, బంగాళాఖాతంలో అల్పపీడనం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు