Hezbollah Commander:ఇంటి ముందే హెజ్‌బొల్లా కమాండర్‌ దారుణ హత్య!

హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్‌ షేక్‌ ముహమ్మద్‌ అలీ హమాదీ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కాల్చి చంపారు.ముహమ్మద్‌ అలీ హెజ్బొల్లా అల్‌ -బఖా రీజియన్‌ కు కమాండర్‌ గా వ్యవహరించాడు

New Update
hezbollah

hezbollah

Hezbollah Commander: హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్‌ షేక్‌ ముహమ్మద్‌ అలీ హమాదీ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కాల్చి చంపారు.తూర్పు లెబనాన్ లో ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.

Also Read: Maharashtra Train Accident: 12 మంది ప్రాణాలు తీసిన పుకారు.. రైలు ప్రమాదానికి ఇదే కారణం

ముహమ్మద్‌ అలీ హెజ్బొల్లా అల్‌ -బఖా రీజియన్‌ కు కమాండర్‌ గా వ్యవహరించాడు.త నివాసం బయటే ఉన్న ఆయన పై రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయనకు తీవ్ర  గాయాలు అయ్యాయి.ఆస్పత్రికి తరలించగా అప్పటికే కన్నుమూసినట్ఉల వైద్యులు వెల్లడించారు.

Also Read: APSRTC: కుంభమేళా వెళ్లేవారికి ఏపీ ఆర్టీసీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే 7రోజుల ప్యాకేజ్ !

అయితే..కొన్నేళ్లుగా కొనసాగుతున్న కుటుంబ కలహాల కారణంగానే ఆయన పై ఈ దాడిజరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కానీ ముహమ్మద్‌ అలీ మృతికి కారణం ఎవరో అనే దాని పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌ లో...

షేక్‌ ముహమ్మద్‌ అలీ హమాదీ ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌ లో ఉన్నట్లు సమాచారం. 1985 లో 153 మంది ప్రయాణికులతో ఉన్న వెస్ట్‌ జర్మన్‌ విమానాన్ని హైజాక్‌ చేసిన వారిలో ఇతడు కీలకంగా వ్యవహరించాడు. ప్రయాణికుల్లో ఉన్న అమెరికా జాతీయుడిని చిత్ర హింసలకు గురిచేయడంతో చనిపోయాడు.

దీంతో అతడిని ఎఫ్‌బీఐ వాంటెడ్‌ లిస్ట్‌ లో చేర్చింది.

Also Read: Stock Market Today: లాభాల్లో  ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర

Also Read: Amitabh Bachchan: బిగ్ బీకి కలిసొచ్చిన రియల్‌ఎస్టేట్.. రూ.83 కోట్లకు అపార్ట్‌మెంట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు