Pakistan: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!
పాకిస్తాన్ మరో పుల్వామా అటాక్ కు రెడీ అవుతుందా అంటే అవుననే అనిపిస్తోంది. పాకిస్తాన్ లోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాది హఫీజ్ సయీద్ నిర్వహిస్తున్న ర్యాలీలే ఇందుకు నిదర్శనం. దీనిలో పాకిస్తాన్ ఆర్మీ కూడా పాల్గొనడం మరింత అనుమానాలకు దారి తీస్తోంది.
INDIA Bloc Rally: ప్రధాని మోదీనే కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు-సునీత కేజ్రీవాల్
దేశరాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ర్యాలీ నిర్వహిస్తోంది. దీనికి కేజ్రీవాల్ భార్య సునీత హాజరయ్యారు. అక్కడ ఆమే కేజ్రీవాల్ పంపిన లేఖను చదివారు. ప్రధాని మోదీయే ఆయనను జైలుకు పంపారని సునీత వ్యాఖ్యలు చేశారు.
US : ఖండాంతరాలను దాటి ప్రతిధ్వనిస్తోన్న జై శ్రీరాం నినాదం.. ప్రాణ ప్రతిష్టకు ముందు హ్యుస్టన్ లో భారీ ర్యాలీ..!!
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముందే జైశ్రీరాం నినాదం ఏడు సముద్రాలను దాటింది. అమెరికాలోనూ జైశ్రీరామ్ నినాదాలు మిన్నంటుతున్నాయి. హ్యుస్టన్ నగరంలో వందలాది మంది జైశ్రీరామ్ నినాదాలతో భారీ ర్యాలీ చేపట్టారు. 216 కార్లతో ర్యాలీ నిర్వహించారు.
Jogulamba Gadwal: అలంపూర్ బీఆర్ఎస్లో వర్గ విభేదాలు
అలంపూర్ బీఆర్ఎస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అబ్రహంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ.. ఎంపీపీ వర్గం భారీ ర్యాలీ నిర్వహించింది. అబ్రహం ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగితే తాము సహకరించేది లేదని స్పష్టం చేశారు.
Thummala Nageswara Rao తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం..
తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం కార్యాక్రామానికి అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముందుగా 2 వేల కార్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జెండా లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాలు దర్శనమివ్వడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారనే వార్తకు మరింత బలం చేకూరింది.