/rtv/media/media_files/2025/04/07/RKPKeONqmPEBPym5SxXg.jpg)
AI Could Achieve Human-Like Intelligence By 2030 And 'Destroy Mankind
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. ఇది అన్ని రంగాల్లో అనేక మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటికే చాట్‌జీపీటీ, డీప్‌సీక్ లాంటి ఏఐ చాట్‌బాట్‌లు ప్రపంచాన్ని ఎలా కుదిపేశాయో అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇలాంటి ఏఐ టెక్నాలజీ మరింతగా రానుంది. అయితే ఏఐ వల్ల మానవాళికి ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ అంతేవరకు నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్
2030 నాటికి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) వస్తుందని ఇది మానవాళిని శాశ్వతంగా నాశనం చేస్తుందని గూగుల్ డీప్‌మైండ్ కొత్త పరిశోధన అంచనా వేసింది. ఏజీఐ వల్ల తీవ్రమైన హాని కలిగించే ప్రమాదం ఉందని తాము అంచనా వేస్తున్నామని పరిశోధకులు చెప్పారు. అధునాతన ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను గూగుల్ డీప్‌మైండ్ వివిధ కేటగిరీలుగా విభజించింది. డేటాను దుర్వినియోగం చేయడం, తప్పులు, తప్పుగా పొందుపరచడం అలాగే నిర్మాణాత్మక ప్రమాదాలు లాంటి ముప్పులు ఉన్నాయని తమ పరిశోధనలో హెచ్చరించింది.
డీప్‌మైండ్ కో ఫౌండర్ షేన్‌లెగ్ సహ రచయితగా ఉన్న అధ్యయనం ప్రకారం చూసుకుంటే ఏజీఐ మానవాళికి ఏ రకంగా హాని చేస్తుందనే విషయాలు స్పష్టంగా చెప్పలేదు. కానీ దీని ముప్పును తగ్గించేందుకు గూగుల్, ఏఐ కంపెనీలు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సూచనలు చేసింది. డీప్‌మైండ్ సీఈవో డెమిస్ హస్సాబిస్ మాట్లాడుతూ మానవుల కంటే తెలివైన ఏజీఐ రాబోతుందని చెప్పారు. రాబోయే ఐదు లేదా పదేళ్లలో ఇది ఉద్భవిస్తుందన్నారు. ఏజీఐ పర్యవేక్షణపై ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల తరఫున ఆయన పోరాటం చేస్తున్నారు.
Also Read: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
అయితే ఏఐకి మరో ముందడుగే ఈ ఆర్టిఫిషయల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) అని నిపుణులు చెబుతున్నారు. ఏఐ అనేది టాస్క్ స్పెసిఫిక్‌గా ఉంటే ఏజీఐ అనేది మానవుల మేధస్సుతో విస్తృత పనులు చేయగలుగుతుందని అంటున్నారు. ఏజీఐ అనేది మనుషుల్లాగే విభిన్నమైన డొమైన్‌లో జ్ఞానాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు.
artificial-intelligence | rtv-news | national-news