Iran: వాళ్ళు మొదలెట్టారు..మేము పూర్తి చేస్తాం-ఇరాన్

అగ్రరాజ్యం అమెరికా మెరుపు దాడిపై ఇరాన్ ఎట్టకేలకు స్పందించింది. అమెరికా మొదలెట్టిన దాన్ని మేము పూర్తి చేస్తామని అంది. టెహ్రాన్‌ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్‌ అధికారిక మీడియా అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది.

New Update
iarn warning

Iran Warning

అమెరికా చాలా పెద్ద నేరం చేసిందని ఇరాన్ మండిపడింది. గగనతల ఆంక్షలను పట్టించుకోకుండా దాడులు చేసి నిబంధనలు ఉల్లంఘించిందని అంది. టెహ్రాన్‌ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్‌ అధికారిక మీడియా అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది. వారి పౌరులకు పశ్చిమాసియాలో ఇకపై స్థానం లేదని తెలిపింది. ఇక్కడ ఉన్న యూఎస్ స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. 

రెండు దేశాల్లో హై అలెర్ట్..

టెహ్రాన్ హెచ్చరికల అనంతరం ఇజ్రాయెల్, అమెరికాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. యూఎస్ లో వాషింగ్టన్ తో సహా ప్రధాన నగరాల్లో భద్రతను పెంచారు. ఇక ఇజ్రాయెల్ లో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. తరువాతి ప్రకటన వచ్చే వరకు అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా దాడులను మరింత పెంచుతామని చెబుతున్నారు. తమ పౌరులకు నష్టం కలిగించేలా ఇరాన్ ఎటువంటి చర్యలు తీసుకున్నా ఊరుకునేది లేదని అన్నారు. ఇప్పుడు చేసిన దాడుల కంటే తీవ్రమైన దాడులు చేస్తామని చెప్పారు. ఇరాన్‌ యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి వచ్చిందని అగ్రరాజ్యం అధ్యక్షుడు చెప్పుకొచ్చాడు. ఇరాన్ కీలకమైన అణుస్థావరాలను ధ్వంసం చేశాం. దాని అణుసామర్థ్యాన్ని నాశనం చేయడమే మా లక్ష్యమని అమెరికా ప్రకటించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న అణు ముప్పును ఆపడమే మా లక్ష్యం. పశ్చిమాసియా దేశాలను ఇరాన్‌ భయపెడుతోంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత టెహ్రాన్‌దే అని ఆయన అన్నారు. 

Also Read: USA: ఇరాన్ పై దాడులు..అమెరికాలో హై అలెర్ట్

Advertisment
తాజా కథనాలు