/rtv/media/media_files/2025/07/26/iran-terror-attack-2025-07-26-15-16-30.jpg)
Iran terror attack
ఆగ్నేయ ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా కోర్టుపైనే కాల్పులు జరిపారు. ఇరాన్ స్థానిక సమయం ప్రకారం.. శుక్రవారం సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్ రాజధాని జహెదాన్‌లోని కోర్టు బిల్డింగ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు పౌరులు, ముగ్గురు దాడి చేసినవారు సహా కనీసం ఎనిమిది మంది మరణించారు. ఈ ప్రాంతంలో యాక్టీవ్‌గా ఉన్న సున్నీ ఉగ్రవాద సంస్థ జైష్ అల్-అద్ల్, ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇరాన్ మీడియా ఛానళ్లు తెలిపాయి. కోర్టు భవనం చుట్టూ కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇందులో ఆత్మాహుతి దాడి జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
🚨🇮🇷 BREAKING: TERROR ATTACK IN ZAHEDAN — 5 DEAD, 13 INJURED 🔥
— Asaf Givoli (@AsafGivoli) July 26, 2025
ARMED RADICALS STORMED THE CITY COURTHOUSE AND OPENED FIRE; JAISH AL-ZULM CLAIMS RESPONSIBILITY. INVESTIGATION ONGOING, CASUALTY TOLL MAY RISE. 🏛️🚑#IRAN#ZAHEDAN#TERRORATTACK#BREAKING#SECURITY
LIKE & FOLLOW… pic.twitter.com/18479rsZlH
సెంట్రల్ జహెదాన్‌లోని కోర్టు హాల్ సముదాయంలో న్యాయమూర్తుల గదుల్లోకి ముష్కరులు చొరబడ్డారు. కనీసం 13 మంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ప్రకటించింది. బలూచ్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న మానవ హక్కుల సంస్థ HAALVSH, ఈ దాడిలో అనేక మంది జుడిషియల్ ఆఫీసర్లు, భద్రతా సిబ్బంది మరణించారని లేదా గాయపడ్డారని చెప్పింది. భద్రతా దళాలు వెంటనే స్పందించి దాడి చేసిన వారిని మట్టుబెట్టగలిగాయి. ఈ ఘర్షణలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు నిర్ధారించారు.