/rtv/media/media_files/2026/02/19/taliban-2026-02-19-14-50-14.jpg)
Taliban’s New Law Allows Men To Physically Punish Their Wives
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. మహిళలపై అణివేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మరో క్రూరమైన చట్టాన్ని తీసుకొచ్చారు. భార్యలను హింసించేలా గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేశారు. దీనిప్రకారం.. భర్తలు తమ భార్య, పిల్లలను శారీరకంగా కొడితే ఎముకలు విరగనంత వరకు, రక్తస్రావం కానంతవరకు అది నేరం కాదు. ఈ కొత్త రూల్స్‌పై అఫ్గానిస్థాన్ సుప్రీం లీడర్ హిబుతుల్లా అఖుంద్జాదా సంతకాలు చేశారు.
భర్త క్రూరంగా ప్రవర్తించినప్పుడు ఎముకలు విరిగినట్లు కనిపించినా లేదా గాయాలు కనిపిస్తే అతడికి కేవలం 15 రోజులు మాత్రమే జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు మహిళలు తాము గృహహింసకు గురైనట్లు కోర్టులో నిరూపించగలగాలి. అలాగే ఆమె కోర్టుకు వెళ్లినప్పుడు కూడా తన బాధ్యతను చూసుకునేలా ఒక పురుషుడు ఉండాలి. జడ్జికి బాధితురాలు తన గాయాలు చూపించేటప్పుడు కూడా పూర్తిగా కవర్ చేసుకొని ఉండాలి. మరోవైపు భార్య భర్త పర్మిషన్ లేకుండా బంధువుల ఇంటికి వెళ్తే.. 3 నెలల జైలుశిక్ష పడుతుంది.
Also Read: భారీగా పెరిగిన కీరా దోస ధరలు.. కిలో రూ.358 పెట్టి కొంటున్న రష్యన్లు
అఫ్గాన్‌లో కొత్త పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 9 ప్రకారం.. సమాజాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. మత పెద్దలు (ఉల్మా), ఉన్నతవర్గం(అష్రాఫ్), మధ్యతరగతి, దిగువ తరగతిగా విభజించారు. శిక్షలు కూడా నేర తీవ్రతను బట్టి కాకుండా ఈ వర్గాలను బట్టి ఉంటాయి. అఫ్గాన్ ప్రభుత్వం 2009లో మహిళలపై హింసను వ్యతిరేకిస్తూ ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త పీనల్ కోడ్ ఆ చట్టాన్ని రద్దు చేసింది.
ఇదిలాఉండగా 2021లో తాలిబన్లు పౌర ప్రభుత్వాన్ని కూల్చేసి అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి వాళ్లు మహిళల హక్కులను కాలరాస్తున్నారు. బాలికల చదువులపై పరిమితులు విధించారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, సినిమాలు చూడొద్దనే ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే గృహహింసను లీగలైజ్ చేసే కొత్త చట్టంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త కోడ్‌ను అమలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలను జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి.
Also Read: మధ్యప్రదేశ్‌లో ఘోరం: భార్య ప్రైవేట్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన భర్త!
Follow Us