Syria: టీవీ స్టూడియోపై బాంబు దాడి..లైవ్ లో ఉన్న లేడీ యాంకర్ పరుగు

సిరియాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగా అధికారిక మీడియా కేంద్రం ఉన్న బిల్డింగ్ మీద కూడా దాడి చేసింది. దీంతో అక్కడ లైవ్ లో ఉన్న లేడీ యాంకర్ పరుగులు తీశారు.  

New Update
syria live

Israel strikes on Syria

సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. డెమాస్కస్‌లోని మిలిటరీ కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. భారీ దాడుల తర్వాత డెమాస్కస్ కు హెచ్చరికలు ముగిశాయని ఇజ్రాయెల్ చెప్పింది. ఇక మీదట భారీ దాడులు తప్పవని హెచ్చరించింది. డ్రూజ్‌లపై దాడి చేసిన బలగాలను ఉపసంహరించుకునే వరకు సువాయిదాలో ఐడీఎఫ్‌ దళాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. 

లైవ్ లో యాంకర్ పరుగులు..

ఇజ్రాయెల్ సిరియాలోని ఆర్మీ సహా ముఖ్యమైన భవనాలన్నింటి మీదా దాడి చేసింది. ఇందులో భాగంగా అధికారిక మీడియా కేంద్రం ఉన్న భవనంపైనా దాడులు జరిపింది. ఆ సమయంలో అక్కడ లైవ్ జరుగుతోంది. అదే టైమ్ లో బాంబులు పడడంతో అక్కడ ఉన్న లేడీ యాంకర్ భయాందోళనలకు గురయ్యారు. బాంబులు చేసిన శబ్దానికి స్టూడియో నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ మంత్రి కట్జ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

సిరియాలోని స్వెయిదా రాష్ట్రంలో స్థానిక మిలీషియాల మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో ఇద్దరు పిల్లలుసహా 30 మందికి పైగా మరణించారు. 100 మంది వరకూ గాయపడ్డారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్‌ మిలీషియాకు, సున్నీ బెడ్విన్‌ తెగలకు మధ్య సాయుధ ఘర్షణ ప్రారంభమైంది. ఈ ఘర్షణను అదుపు చేసేందుకు ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగడంతో వాటిపై ఇజ్రాయెల్‌ దాడికి పూనుకుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు