NASA: సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారు–నాసా

స్పేస్‌లో ఉన్న సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారని నాసా చెప్పింది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది అంటూ వచ్చిన వచ్చిన వార్తను నాసా కొట్టిపడేసింది. తాము వ్యోమగామలందరికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని వివరించింది. 

Sunita Williams : నిలిచిపోయిన సునితా విలియమ్స్ రోదసి యాత్ర..
New Update

Sunitha Williams : 

రెండు రోజుల క్రితం అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాముల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో సునీతా బరువు తగ్గి...చాలా అనారోగ్యంగా ఉన్నట్టు కనిపించారు. ఇది చాలా మందికి ఆందోళన కలిగించింది. దీనిపై అమెరికాకు చెందిన డాక్టర్ వినయ్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. సునీతా పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని అందువల్లే బలహీనంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు ఇది పెద్ద చర్చకు దారి తీసింది. 

Also Read :  Revanth Reddy Birthday: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. జడ్పీటీసీ టూ సీఎం.. ఆయన సక్సెస్ కు కారణం ఇదే..!

అయితే ఈ వ్యాఖ్యలను, సునీతా ఆనారోగ్యం వచ్చిన వార్తలను నాసా ఖండించింది. సునీతా విలియమ్స్‌తో సహా వ్యోమగాములందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతాయని, ఫ్లైట్‌ సర్జన్లు పర్యవేక్షిస్తారని తెలిపింది. 

Also Read :  3 స్టేట్స్‌.. 9 థియేటర్స్‌.. రామ్‌చరణ్‌ టీజర్ లాంచ్‌ ప్లాన్‌ చూస్తే మైండ్‌ బ్లాక్ అవ్వడం పక్కా భయ్యా!

బోయింగ్ స్టార్‌ లైనర్‌ లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష లోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ లు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వీరిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమి మీదకు తిరిగి తీసుకువస్తామని నాసా చెప్పింది. రీసెంట్ గా సునీత విలియమ్స్‌ మాట్లాడుతూ…అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి వారిద్దరూ ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటామని తెలియజేశారు.  ఐఎస్‌ఎస్‌లో ఉండి నా కుటుంబాన్ని, నా రెండు కుక్కలను చాలా మిస్సవుతున్నా.. నాకే కాదు ఇది నా ఫ్యామిలీకి చాలా కష్టతరమైన సమయం.. అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారని సునీత విలియమ్స్ చెప్పుకొచ్చారు.

Also Read : EC: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు..558 కోట్లు సీజ్

Also Read :  డైరెక్టర్ క్రిష్ ఇంట పెళ్లి సందడి.. అమ్మాయి మరెవరో కాదు..!

#social-media #nasa #sunitha-williams
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe