Krish: డైరెక్టర్ క్రిష్ ఇంట పెళ్లి సందడి.. అమ్మాయి మరెవరో కాదు..! డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ష్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లా అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోబోతున్నారట. ఈనెలలోనే పెళ్లి కూడా జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్‌కు ఇది రెండో పెండ్లి. By Archana 08 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update director krish షేర్ చేయండి Director Krish : డైరెక్టర్ క్రిష్ గమ్యం, వేదం, కంచె వంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే 'కొండపొలం' అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన క్రిష్.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ‘ఘాటి ‘అనే సినిమా చేస్తున్నారు . ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇటీవలే అనౌన్స్ చేయడం జరిగింది. 'వేదం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కావడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్ క్రిష్ ఇంట పెళ్లి సందడి ఇది ఇలా ఉంటే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. క్రిష్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను రెండో వివాహం చేసుకోబోతున్నారట. ఈ నెలలోనే నిశ్చితార్థం, వివాహం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్‌కు మొదటగా పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా డాక్టర్. రమ్య అనే వైద్యురాలితో పెళ్లవగా .. కొన్నాళ్లకు వ్యక్తిగత విభేదాలతో విడిపోయారు. అయితే ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయి కూడా డాక్టర్ కావడం గమనార్హం. Also Read: పృథ్వీ- విష్ణు ప్రియా విడిపోయినట్లేనా..! ఇద్దరి మధ్య పెద్ద గొడవ ఇటీవలే అనుష్క శెట్టి బర్త్ డే సందర్భంగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'ఘాటి’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అనుష్క మొహమంతా రక్తంతో, చేతిలో సిగరెట్ పట్టుకొని టెరిఫిక్ గా కనిపించింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఉత్తరాంధ్ర అటవీ ప్రాంత నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈమూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. Also Read: 3 స్టేట్స్.. 9 థియేటర్స్.. రామ్‌చరణ్ టీజర్ లాంచ్ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా భయ్యా! Also Read : డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు షాక్.. తొలగిస్తూ ఉత్తర్వులు #krish-jagarlamudi #tollywood #anushka-shetty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి