ఈ ఏడాది జూన్‌లో నాసా ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎనిమిది రోజుల కోసం అక్కడి వెళ్లిన ఆమె.. సాంకేతిక కారణాలతో అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఇంకా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లోనే ఉంటున్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. దీంతో తాజాగా సునీతా విలియమ్స్ ఈ ఆరోపణలపై మరోసారి స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేస్తూ ఓ ఫొటోను విడుదల చేశారు.
Also Read: మహారాష్ట్రలో పవన్ ప్రచారం..తెలుగు, హిందీ, మహారాష్ట్రల్లో ప్రసంగం
కొద్దిరోజుల క్రితమే సునీతా విలియమ్స్ బక్కచిక్కిన ముఖంతో కనిపించారు. అయితే ఇప్పుడు విడుదల చేసిన ఫొటోలో విలియమ్స్ ముఖంలో మాత్రం మార్పులు కనిపించాయి. దీన్ని బట్టి చూస్తే ఆమె ఆరోగ్యం కుదుట పడినట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అంతరిక్షంలోని పలు సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ ఏడాది జూన్ 5న సునీతా విలియమ్స్, బుచ్‌విల్‌మోర్ స్టార్‌లైనర్ స్పేస్‌లోకి వెళ్లారు. అక్కడ పని పూర్తయ్యాక 8 రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ వ్యోమగాముల్ని తీసుకెళ్లిన బోయింగ్ క్రూ ఫ్లైట్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో ఇద్దరు వ్యోమగాములు అక్కడే చిక్కుకున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది వరకు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది.
Also Read: రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి?
అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ వల్ల సునీతా విలియమ్స్ శరీరంలో ఎర్రరక్తకణాలు క్షీణించాయి. దీనివల్ల సునీతా విలియమ్స్ ముఖం బక్కచిక్కిపోయింది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. తిరిగి సాధారణ పరిస్థితికి రావాలంటే పౌష్టికాహారం తప్పనిసరి. అయితే ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సునీతా విలియమ్స్ అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకునేలా ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీని ఫలితంగానే ఆరోగ్యం కుదటపడి సాధారణ స్థితికి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: అమ్మో దెయ్యం.. 50మంది మృతి, వణికిపోతున్న తెలంగాణ వాసులు!