Japan: మనుషులు కనిపించక బెంగపెట్టుకున్న చేప

మనుషులకే కాదు ఎమోషన్స్ జంతువులకు చేపలకు కూడా ఉంటాయి. పెంపుడు జంతువుల్లో వీటని మనం తరుూ చూస్తూనే ఉంటాము. ఇప్పుడు చేపలకు కూడా ఎమోషన్స్ ఉంటాయని తెలుస్తోంది. జపాన్ లో జరిగిన ఈ సంఘటనే దానికి ఉదాహరణ.

New Update
Japan

Sun Fish

రోజూ చేసే పని చేయకపోయినా, మనుషులు కనిపించకపోయినా బెంగగా ఉంటుంది చాలా మందికి. అయితే ఇది కేవలం మనుషులకు మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే చేపలు, జంతువుల్లో కూడా ఈ పరిస్థితి, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి.  కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువుల్లో దీన్ని మన గ్రహిస్తాము. ఇప్పుడు చేపలు కూడా ఇందుకు అతీతం కావని నిరూపిస్తున్నాయి. తాజాగా జపాన్ లోని ఓ అక్వేరియంలో చేప మనుషులు కనిపించడం లేదని తినడం మానేసింది.

ఏమైందంటే..

జపాన్ లోని షిమోనోసెకిలోని కైక్యోకాన్‌ అక్వేరియం ాగు చేసి, మోడిఫికేషన్ చేయడం కోసం కొన్నాళ్ళు మూసేశారు. దాంతో ఇక్కడకు సందర్శకులు రావడం మానేశారు. అయితే ఇందులో ఉన్న సన్ పిష్ కు ఇది నచ్చలేదు. దానికి రోజూ మనుషులు రావడం, వారి కోసం రకరకాల విన్యాసాలు చేయడం అలవాటైపోయింది. ఒక్కసారిగా వాళ్ళు కనిపించకపోయేసరికి బెంగ పెట్టేసుకుంది. దాంతో తినడం మానేసింది. అంతేకాదు తన శరీరాన్ని ట్యాంకుకు కొట్టుకోవడం ప్రారంభించింది. దీన్ని అక్వేరియం నిర్వాహకులు గమనించారు. తిన్నది అరక్క అలా చేస్తోందేమో అనుకున్నారుట ముందు. కానీ తర్వాత అది కారణం కాదని తెలిసింది. చాలారోజులు వారికి సన్ ఫిష్ ఎందుకు అలా ప్రవర్తిస్తోందో అ్ధం కాలేదు. సందర్శకులు లేక ఒంటరితనంగా భావిస్తుందేమోనని సిబ్బంది ఒకరు అంటే ముందు పట్టించుకోలేదు.. కారణం అది కాకపోవచ్చని అనిపించింది... కానీ ఎందుకైనా మంచిదని సిబ్బంది యూనిఫామ్‌లను అక్వేరియం దగ్గరగా వేలాడదీశాం.. బయట మనుషుల కటౌట్‌లు ఉంచాం. దాంతో ఆ చేప మళ్ళీ హుషారుగా ఉండడం ప్రారంభించింది. నీళ్ళల్లో తిరుగుతూ, తింటూ ఆరోగ్యంగా మారింది. అప్పుడు అర్ధం అయింది మాకు అది మనుషులను మిస్ అవుతోందని అని చెబుతున్నారు నిర్వాహకులు.

జపాన్లో చేపలు లా ప్రవర్తించడం ఇదేమీ మొదటిసారి కాదు.  ఇంతకు ముందు కరోనా టైమ్ లో వైరస్ వ్యాప్తిచెందకూడదని భావించి అన్నీ షట్ డౌన చేశారు. అప్పుడు టోక్యోలో సుమిదా అక్వేరియంలో ఈల్ చేపలు కూడా ఇలానే ప్రవర్తించాయి. మనుషులు రాకపోవడంతో అక్వేరియంలోని గార్డెన్ ఈల్స్ చేపలు అందులో ఇసుక కింద నుంచి బయటకు రాలేదు. అప్పుడు నిర్వాహకులు సందర్శకుల చేత రోజూ వీడియో కాల్స్ చేయించారు. దాంతో ఆ చేపలు ఇసుక నుంచి బయటకు వచ్చి ఈదడం మొదలుపెట్టాయి. 

Also Read : HYD: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో ముగిసిన ఐటీ సోదాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు