SouthKorea:సస్పెండ్ అయిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో మార్షల్ లా విధించినప్పటి నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తనపై మొదటి అభిశంసన ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఆయన విశ్వాసం కోల్పోవడంతో ఆ తర్వాత ఆయనను అధ్యక్షుడిని పదవి నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయనని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు.
Also Read: Ap: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..రేపటి నుంచే ఆ పథకం అమలు!
3,000 మంది పోలీసులు..
ప్రెసిడెంట్ హౌస్ బయట జనం భారీగా ఉండటంతో పోలీసులు ఇంట్లోకి వెళ్లడం జరగలేదు. యూన్ సుక్ యోల్ భద్రతా సిబ్బంది ఆయన్ని అరెస్టు చేసేందుకు వచ్చిన బృందంతో వాగ్వాదానికి దిగారు. దీంతో యూన్ సుక్ యోల్‌ను ఇంకా అరెస్టు చేయలేదు. యూన్ సుక్ యోల్‌ను అరెస్టు చేయడానికి ముందు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసుకోన్నారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో 3,000 మంది పోలీసులను మోహరించారు.
Also Read: Delhi: వణుకుతున్న ఉత్తరాది..విమానాలు, రైల్వే సర్వీసుల పై ఎఫెక్ట్!
దీంతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ మొత్తం ఘటనపై నిఘా ఉంచారు. దక్షిణ కొరియాలో సిట్టింగ్ అధ్యక్షుడికి జారీ చేసిన తొలి అరెస్ట్ వారెంట్ ఇదే కావడం గమనార్హం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇంటి దగ్గర భారీ సంఖ్యలో నిరసనకారులు గుమిగూడారు. యూన్ సుక్ యోల్‌కు మద్దతుగా మద్దతుదారులు నినాదాలు చేస్తున్నారు.
యున్ సుక్ యోల్ అరెస్టు వార్త గురించి తెలిసిన వెంటనే ఉదయాన్నే ఆయన ఇంటి దగ్గర ఆందోళనకారులు గుమిగూడారు. వందలాది మంది ప్రజలు తమ నాయకుడిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తున్నారు. అంతే కాకుండా పోలీసులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న జనం వారికి అడ్డుపడ్డారు. యున్ డిసెంబరు 3న అర్థరాత్రి దేశవ్యాప్తంగా యుద్ధ చట్టాన్నితీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే నిరసనల కారణంగా ఈ నిర్ణయం కేవలం కొన్ని గంటల్లోనే ఉపసంహరించుకోవడం జరిగింది. యున్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అభిశంసనను తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయనను పదవి నుంచి తప్పించారు.
Also Read: Prakasam: ఏపీలో కొత్త రైల్వే స్టేషన్ రెడీ..తొలిసారి ప్యాసింజర్ రైలు!
Also Read: Madhya Pradesh: పెళ్లి చేసుకోకపోయినా.. దానికి ఒకే అంటున్న హైకోర్టు!