M TV: సంగీత ప్రియులకు షాక్‌ .. ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేత

నాలుగుదశాబ్ధాలుగా సంగీత ప్రియులను అలరిస్తూ వస్తున్న ఎమ్‌టీవీ పారామౌంట్‌ గ్లోబల్‌ మూతపడనుంది. డిసెంబర్‌ 31 తర్వాత ‘ఎమ్‌టీవీ మ్యూజిక్’, ‘ఎమ్‌టీవీ 80స్’, ‘ఎమ్‌టీవీ 90స్’, ‘క్లబ్‌ ఎమ్‌టీవీ’, ‘ఎమ్‌టీవీ లైవ్‌’ వంటి సంగీత ఛానళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

New Update
MTV Music Channel closure

MTV Music Channel closure

M TV:  నాలుగు దశాబ్ధాలుగా  సంగీత ప్రియులను అలరిస్తూ వస్తున్న ఎమ్‌టీవీ పారామౌంట్‌ గ్లోబల్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 31 తర్వాత ‘ఎమ్‌టీవీ మ్యూజిక్’, ‘ఎమ్‌టీవీ 80స్’, ‘ఎమ్‌టీవీ 90స్’, ‘క్లబ్‌ ఎమ్‌టీవీ’, ‘ఎమ్‌టీవీ లైవ్‌’ వంటి సంగీత ఛానళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించి షాక్‌ ఇచ్చింది.ఎంటీవీ మ్యూజిక్‌ ఛానల్ సంగీత ప్రియుల్ని, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. అలాంటి ఎమ్‌టీవీ (M TV ) ఒక షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ ఎమ్‌టీవీ పారామోంట్‌ గ్లోబల్‌ ద్వారా నలభయేళ్లకు పైగా సంగీత ప్రసారాలను అందించిన అనుబంధ ఛానళ్లను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎంటీవీ అనుబంధ ఛానల్స్‌ అయిన ‘ఎమ్‌టీవీ మ్యూజిక్‌’, ‘ఎమ్‌టీవీ 80స్‌’, ‘క్లబ్‌ ఎమ్‌టీవీ’, ‘ఎమ్‌టీవీ 90స్‌’. ‘ఎమ్‌టీవీ లైవ్‌’  తదితర సంగీత ఛానళ్లను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబరు 31 తర్వాత ఆ ఛానళ్లు అందుబాటులో ఉండవని పేర్కొంది. అయితే, రియాలిటీ షోలను అందించే ఎమ్‌టీవీ హెచ్‌డీ మాత్రం యధావిధిగా కొనసాగుతుందని వెల్లడించింది. స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక ఈ ఛానళ్లకు ఆదరణ తగ్గడం, యూట్యూబ్‌, టిక్‌టాక్‌, స్పాటిఫై వంటి సంగీతం అందించే యాప్స్‌తో పోటీపడలేకపోవడం మూలంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవలె ఎమ్‌టీవీ పారామౌంట్‌ గ్లోబల్‌ సంస్థ, స్కై డాన్స్‌ మీడియాతో విలీనమైంది. 1981లో అమెరికాలో ఎమ్‌టీవీని స్థాపించబడిన విషయం తెలిసిందే.

Also Read: ఒకేసారి ఇద్దరు హీరోయిన్స్‌తో సిద్ధు.. ‘తెలుసు కదా’ ట్రైలర్ షాక్ ఇచ్చిందా..?

ఇది కూడా చూడండి: Gold Rates: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

Advertisment
తాజా కథనాలు