/rtv/media/media_files/2025/04/28/0RMQA3snvxDxUVyHAQMl.jpg)
sheep condom Photograph: (sheep condom)
Condom: జీవిత భాగస్వాములతో కాకుండా ఇతరులతో శృంగారంలో పాల్గొనే వారు తప్పకుండా కండోమ్ ఉపయోగించాలి. లేదంటే ఎయిడ్స్ భారినపడటంతోపాటు ఇతర సుఖవ్యాధులు సైతం సోకే అవకాశం ఉంటుంది. అలాగే అవాంఛిత గర్భధారణను నివారించడానికి వయోజన జంటలు కండోమ్‌ను వాడుతుంటాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వాలు కండోమ్‌ల వాడకం గురించి అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టాయి. అయితే ఇప్పుడున్న జనరేషన్‌లో శృంగార రిలేషన్ పెరిగిపోవడంతో వీటి వాడకం కూడా భారీ స్థాయిలో రెట్టింపు అయింది. మార్కెట్ లో చాలా రకాల కండోమ్స్ అందుబాటులో ఉన్నాయి. మారిన కాలంతో పాటు రకరకాల ఫ్లేవర్స్‌తో కూడిన కండోమ్స్ వస్తున్నాయి. కండోమ్‌ల ధరలు వాటి నాణ్యత, ఫ్లేవర్ బట్టి మారుతుంటాయి. అయితే గొర్ర పేగుతో చేసిన కండోమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనగా గుర్తింపు పొందింది. ఇంతకు దాని ధర ఎంత? ఎలా తయారు చేశారో చూద్దాం.
పందులు, దూడలు, మేకల పేగుల నుంచి..
గొర్రె పేగు నుంచి తయారు చేసిన అత్యంత ఖరీదైన కండోమ్‌కు 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఇటీవల స్పెయిన్‌లో జరిగిన వేలంలో దాదాపు రూ.44,000 కు అమ్ముడైంది. భారీ ధరకు అమ్ముడైన ఈ కండోమ్‌కు అసలు పేరు లేకపోవడం విశేషం. ఇంతటి చరిత్ర ఉన్న ఈ కండోమ్‌ను ఫ్రాన్స్‌లో మొదటిసారి తయారు చేశారు. దీని పొడవు 19 సెం.మీ అంటే 7 అంగుళాలు ఉంటుంది. 18వ శతాబ్దంలో ఇలాంటి కండోమ్‌లను గొర్రెలు, పందులు, దూడలు, మేకల పేగుల నుంచి చేతితోనే వీటిని తయారు చేసేవారని సీనియర్ వైద్యులు తెలిపారు.
1932 నుంచి ఈ కండోమ్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి స్పెర్మ్ మార్గాన్ని అడ్డుకుంటాయి. కానీ లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నందున వీటిని సిఫార్సు చేయట్లేదు. ఎందుకంటే వాటి రంధ్రాలు అంటువ్యాధి కారకాలను అనుమతించేంత పెద్దవిగా ఉంటాయి. సుమారు 3,000 సంవత్సరాల క్రితం పురాతన ఈజిప్షియన్లు సుఖ వ్యాధుల నుంచి రక్షణకోసం నార తొడుగులను ఉపయోగించారు. 1700ల ప్రాంతంలో కండోమ్‌లను జంతువుల ప్రేగుల నుంచి తయారు చేసేవారు. 1990ల నాటి ఈ కండోమ్‌ను యునైటెడ్ స్టేట్స్‌లో న్యూజిలాండ్ గొర్రె పేగుల నుంచి తయారు చేశారు.
goat | telugu-news | today telugu news