Pakistan: ట్రైన్ హైజాక్.. 200 మంది వేరువేరు ప్రాంతాల్లో నిర్బంధం

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) వేర్పాటువాదుల నుంచి పాక్ భద్రతా బలగాలు ఇప్పటివరకు 190 మందిని రక్షించాయి. అయితే మరో 200 మందిని ఐదు వేరు వేరు ప్రాంతాల్లో మిలిటెంట్లు బంధించినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Balochistan Liberation Army

Balochistan Liberation Army

పాకిస్థాన్‌ రైలు హైజాక్ ఘటన సంచలనం రేపుతోంది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) వేర్పాటువాదుల నుంచి పాక్ భద్రతా బలగాలు ఇప్పటివరకు 190 మందిని రక్షించాయి. అలాగే 30 మంది బలూచ్ తీవ్రవాదులను హతం చేసినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే మరో 200 మందిని బలూచ్‌ మిలిటెంట్లు ఐదు వేరు వేరు ప్రాంతాల్లో బంధించినట్లు పాకిస్థా్న్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

Also Read: 350 ఏళ్ల పోరాటం.. దళితులకు ఆ గుడిలో పూజలు చేసుకునేందుకు అనుమతి!

హైజాక్ అయిన రైల్లోని తొమ్మిది బోగీల్లో దాదాపు 400 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో బలూచ్ వేర్పాటువాదులు చిన్న టీమ్‌లుదా విడిపోయారు. ఈ క్రమంలోనే తమ ఆపరేషన్ కష్టతరంగా మారిందని పాక్ భద్రత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బలూచ్ రెబల్స్ అఫ్గానిస్థాన్‌లో ఉన్న వారి కీల నేతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి చెప్పారు. ట్రైన్ హైజాక్ చేసేందుకు మొత్తం 70 నుంచి 80 మంది వేర్పాటువాదులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.  

Also Read: కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు

దీంతో పాక్‌ ప్రభుత్వం బలూచిస్థాన్‌కు రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసిన రాజకీయ ఖైదీలు, ఉద్యమకారులు, అదృశ్యమైన వాళ్లను 48 గంటల్లో విడిచిపెట్టాలని బీఎల్‌ఏ డిమండ్ చేస్తోంది. లేకంటే తమ బందీలుగా ఉన్నవాళ్లందిరినీ చంపేస్తామంటూ హెచ్చరిస్తోంది. రైలును ధ్వంసం చేస్తామని కూడా బెదిరిస్తోంది. బలోచిస్థాన్‌ ప్రావిన్సులోని క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ అయిన విషయం తెలిసిందే. 

Also Read: క్యూఎస్‌ వరల్డ్ ర్యాంకింగ్స్‌ జాబితా విడుదల.. టాప్‌ యూనివర్సిటీలు ఏవంటే ?

Also Read: ఆన్‌లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు