/rtv/media/media_files/2025/10/22/serious-road-accident-63-people-on-the-spot-2025-10-22-17-30-34.jpg)
Serious road accident.. 63 people on the spot..
Road Accident : ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తు ఇలా అనేక కారణాలతో పాటు డ్రైవింగ్ లో అనుభవం లేకపోవడం వంటి కారణాలతో రోడ్డుప్రమాదాలు చోటుచేసుకుంటాయి. కొంతమంది డ్రైవర్లు నిర్లక్షంగా చేసే తప్పుకు అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. రోడ్డుప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా మార్పు మాత్రం రావడం లేదు. ఫలితంగా అనేకమంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 63 మంది మృతిచెందారు.
ఉగాండా రాజధాని కంపాలలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 63మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కంపాలలో ఓ రోడ్డుపై పలు వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గులు ప్రాంతంలోని హైవేపై ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని ఓవర్‌టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న మరో బస్సును వేగంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో సదరు బస్సు డ్రైవర్ బస్సును మరో వైపునకు తిప్పాడు. అదే సమయంలో బస్సుకు పక్కనే ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఇలా నియంత్రణ కోల్పోయిన పలు వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొట్టుకుని రోడ్డుపై బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో స్పాట్ లోనే అనేక మంది మృతిచెందగా.. మరికొందరిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో రోడ్డు పై వాహనాలు, మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ క్రమంలో మృతదేహాలను పోస్టుమార్టానికి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం 63 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో పలువురు చికిత్స పొందుతున్నారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తమ దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్ టేకింగ్ చేస్తుండమేనని.. వాహనదారులు రోడ్లపై తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఉగాండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Also Read : K Ramp Collections: 'కె-ర్యాంప్' కలెక్షన్స్..! అప్పుడే బ్రేక్ ఇవెన్ అయిపోయిందా..?