TEST CRICKET: టెస్టు క్రికెట్‌లో విఫలమవుతున్న భారత జట్టులో భారీ మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. స్వేదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఘోర పరాభవం మూటగట్టుకున్న టీమ్ ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలోనూ ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టు విజయం కాస్త ఊరటనిచ్చినప్పటికీ మిగతా రెండు టెస్టుల్లో బుమ్రా మినహా మిగతా ఆటగాళ్లంతా తేలిపోయారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలోనూ పెద్దగా ప్రభావం చూపించట్లేదు. ఈ క్రమంలోనే అనూహ్యంగా అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ టెస్టు సిరీస్‌తోనే సీనియర్ల భవితవ్యం తేలిపోనున్నట్లు ఊహగానాలు జోరందుకున్నాయి. వరుసగా విఫలమవుతున్న విరాట్, రోహిత్ టెస్టుల నుంచి తప్పుకుంటారని, బుమ్రా టెస్టు పగ్గాలు చేపట్టబోతున్నట్లు కొత్త చర్చ తెరపైకొచ్చింది. Really special 🇮🇳🙌🏾 pic.twitter.com/xIiX2PozNZ — Jasprit Bumrah (@Jaspritbumrah93) November 25, 2024 టీమ్‌ఇండియా పగ్గాలు బుమ్రాకే. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రోహిత్ గురించి మాట్లాడిన సునీల్ గావస్కర్.. 'రోహిత్ శర్మ బ్యాటర్, కెప్టెన్‌గా విఫలమవుతున్నాడు. మిగతా రెండు టెస్టుల్లో రాణించకపోతే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది' అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే తొలి మ్యాచ్‌లో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వంలో టీమ్‌ఇండియా 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిందని, టీమ్‌ఇండియా పగ్గాలు బుమ్రా చేపడితే బాగుంటుందన్నాడు. పెర్త్ టెస్టులో అది రుజువైంది.. ఇక ఇదే తరహాలో.. భారత జట్టుకు బుమ్రా అద్భుతమైన కెప్టెన్సీ ఆప్షన్ అవుతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ తన మనసులో మాట బయటపెట్టాడు. బుమ్రా కెప్టెన్సీ బాగుంటుంది. పెర్త్ టెస్టులో అది రుజువైంది. పర్‌పెక్ట్‌గా ఫీల్డింగ్ సెట్ చేశాడు. అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అతని మణికట్టు, బంతిని వదిలే పద్ధతి భిన్నంగా ఉంది. అతని రన్నప్ కూడా డిఫరెంట్. బ్యాటర్లును ఇబ్బందిపెట్టడంలో దిట్ట' అంటూ బోర్డర్ ప్రశంసలు కురిపించాడు. దీంతో అంతర్గత సమాచారంతోనే వీరు మీడియా ముందు అసలు విషయం బయటపెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇక డిసెంబరు 26న మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్- భారత్ మధ్య (4) బాక్సింగ్ డే టెస్టు మొదలుకానుంది.