సాధారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వారిలో మార్పు తీసుకొచ్చేందుకు వివిధ రకాల పనులు చేయిస్తుంటారు. అలాగే ఆ ఖైదీలు ఆదాయం కూడా అందుతాయి. అయితే యూకేలో మాత్రం జైళ్లలో శిక్ష అనుభవిస్తూ పనిచేస్తున్న ఖైదీలు అక్కడి అధికారుల కన్నా ఎక్కువ జీతం అందుకుంటున్నారు. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.
Also Read: థర్డ్ వరల్డ్ వార్ మొదలైంది–ఉక్రెయిన్ మాజీ జనరల్
ఇక వివరాల్లోకి వెళ్తే.. యూకేలోని పలు బహిరంగ జైళ్లలో ఉండే ఖైదీలు బయటకు వెళ్లి పని చేసుకోవచ్చు. ఈ అవకాశం అక్కడ ఉంటుంది. దీంతో అక్కడ వివిధ రకాల ఉద్యోగాలు చేసుకుంటున్న ఖైదీలు జైల్లో ఉండే సెక్యూరిటీ గార్డులు, సెకండరీ టీచర్లు, బయోకమిస్టులు, సైకోథెరపిస్ట్‌ల కన్నా ఎక్కువగా ఎక్కువగా సంపాదిస్తున్నారు. వీళ్లలో కొందరు ఏకంగా ఏడాదికి 46,005 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.38,84,491 జీతం పొందుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
Also Read: అదానీకి బిగ్ షాక్.. 21 రోజుల తర్వాత ఇక అరెస్టేనా?
ఇక మరికొందరు ఖైదీలు 28, 694 డాలర్లు (రూ.24,22,814) కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇక జైలు గార్డు జీతం 35,085 (రూ.29,62,446)గా ఉంది. ఇదిలాఉండగా.. మరికొంతమంది బస్సులు, ట్రక్కులు నడుపుతూ కూడా ఉపాధి పొందుతున్నారు. ఈ ఖైదీలు తమ శిక్షా కాలం ముగిసే సమయానికి తాత్కాలిక లైసెన్స్‌ను కూడా పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read: రేపే పార్లమెంటు సమావేశాలు.. వాడివేడిగా సాగిన అఖిలపక్ష సమావేశం
అయితే సంపాదించిన దానినుంచే ఖైదీలు పన్నులు, కోర్టు జరిమానాలు కూడా చెల్లిస్తారని అధికారులు తెలిపారు. వీళ్లు తమ సంపాదనలో కొంతభాగం పలు స్వచ్ఛంద సంస్థలకు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ఖైదీల శిక్షాకాలం ముగిసిన తర్వాత వాళ్లు పరివర్తన చెందిన వ్యక్తులు సమాజంలో మంచి పేరు తెచ్చుకునేందుకు కూడా ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతోందని అధికారులు చెబుతున్నారు.
Also Read: మహా సీఎంగా ఎవరూ ఊహించని వ్యక్తి.. BJP సంచలన వ్యూహం!