Russia: రష్యాలో మరో దారుణం.. కారులో బాంబు, మేజర్‌ జనరల్‌ మృతి

రష్యాలో మరో దారుణం జరిగింది. ఆ దేశ రాజధాని మాస్కోలో మేజర్ జనరల్ ఫనిల్ సర్వరొవ్‌ వెళ్తున్న కారులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు.

New Update
Russian general killed in car bomb in Moscow, investigators say

Russian general killed in car bomb in Moscow, investigators say

రష్యాలో మరో దారుణం జరిగింది. ఆ దేశ రాజధాని మాస్కోలో మేజర్ జనరల్ ఫనిల్ సర్వరొవ్‌ వెళ్తున్న కారులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. దుండగులు కారు కింది భాగంలో IEDని అమర్చినట్లు దర్యాప్తులో తేలింది. కారు కదిలిన కొన్ని సెకండ్లలోనే అది పేలిపోలిపోయినట్లు గుర్తించారు. 

Also Read: తెలంగాణలో SIR.. ఎలా చేస్తారో తెలుసా ?

ఈ బాంబు దాడి వెనుక ఉక్రెయిన్‌ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. ఇదిలాఉండగా ఫనిల్ సర్వరోవ్ రష్యా బలగాల ఆపరేషనల్ ట్రైనింగ్‌ డైరెక్టరేట్‌కు అధ్యక్షత వహిస్తున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో కూడా ఈయన కీలక సేవలు అందించారు. అయితే తాజాగా బాంబు దాడిలో ఆయన మృతి చెందడం కలకలం రేపుతోంది.  

Advertisment
తాజా కథనాలు