Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడి.. 12 మంది మృతి

ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 12 మంది మృతి చెందారు. ఉక్రెయిన్‌పై 69 క్షిపణులు, 298 డ్రోన్లతో మొత్తం 37 ప్రదేశాల్లో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

New Update
Russia-Ukraine war

Russia-Ukraine war

కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడి చేసింది. ఉక్రెయిన్‌ రాజధానితో పాటు పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మొత్తం 367 డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. ఉక్రెయిన్‌, రష్యా మధ్య గత మూడేళ్ల నుంచి యుద్ధం జరుగుతోంది. ఈ మూడేళ్లలో ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. అయితే రష్యా ఉక్రెయిన్‌పై 69 క్షిపణులు, 298 డ్రోన్లు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌‌పై రష్యా బాంబులు వేసింది.

ఇది కూడా చూడండి:Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

ఇది కూడా చూడండి:BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

ముగ్గురు చిన్నారులు కూడా..

ఈ వైమానిక దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడటంతో పాటు 80 నివాస భవనాలు ధ్వంసం అయ్యాయి. ఉక్రెయిన్‌లో దాదాపుగా 27 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించినట్లు తెలుస్తుంది. రష్యా ఇరాన్ తయారు చేసిన షాహెద్‌ డ్రోన్లను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ఈ దాడులకు భయపడి వందల మంది ఉక్రెయిన్‌ పౌరులు అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లలోకి వెళ్లి ఉంటున్నారు. 

ఇది కూడా చూడండి:BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

Advertisment
తాజా కథనాలు