/rtv/media/media_files/2025/08/08/oil-trade-2025-08-08-11-17-27.jpg)
Russia, India Oil Trading
ఎలా అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ముప్పుతిప్పలు పెట్టాలని రష్యా డిసైడ్ అయింది. దానికి తగ్గట్టుగానే భారత్ కు ఆపర్ల మీద ఆపర్లు ప్రకటిస్తోంది. దేన్నైతే సాకుగా చూపించి ఇండియా మీద అదనపు సుంకాలను విధించారో ఇప్పుడు అదే చమురు మరింత చౌకగా భారత్ కు ఇవ్వడానికి రష్యా రెడీ అయింది. ఈ విషయాన్ని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ కేపీఎల్‌ఈఆర్ లిమిటెడ్ వివరంగా ప్రకటించింది. ఉరల్స్ గ్రేడ్ క్రూడ్.. డేటెడ్ బ్రెంట్ చమురు కంటే ఐదు డాలర్లు చౌకగా ఉంది. ఇవి దాదాపు రెండు వారాల క్రితం ఒకే రకంగా ఉండేవని చెబుతోంది. ఉరల్స్ చమురు ధర భవిష్యత్తులో మరింత పతనం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
భవిష్యత్తులో మరింత తగ్గనున్న ఆయిల్ ధరలు..
మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు రష్యా చమురు కొనుగోళ్లను చాలా జాగ్రత్తగా గమనిస్తూ, అప్రమత్తంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థలు రష్యా నుంచి కొనుగోళ్లు ఆపేసే యోచనలో ఉన్నాయి. ప్రవైట్ సంస్థలు మాత్రం కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ లో రష్యా చమురుకు 37 శాతం మార్కెట్ వాటా ఉంది. ప్రభుత్వ సంస్థలు కొనుగోళ్లు ఆపేస్తే ఇది బాగా తగ్గిపోతుంది. అంతేకాదు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు రష్యా చమురు ప్లాంట్ల మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడినుంచి భారీఎత్తున ఆయిల్‌ను ఎగుమతి చేస్తారు. దాని వలన కూడా ఆయల్ ధరలు బాగా తగ్గుతాయని కేపీఎల్ఈఆర్ వివరిస్తోంది.
Also Read: Trump Tariffs Effect: మావల్ల కాదు బాబోయ్..చేతులెత్తేసిన అమెరికా బడా కంపెనీలు