Trump Tariffs Effect: మావల్ల కాదు బాబోయ్..చేతులెత్తేసిన అమెరికా బడా కంపెనీలు

అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాలు అప్పుడే ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. టారీఫ్ ల భయంతో వాల్ మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ లాంటి కంపెనీలు భారత్ నుంచి స్టాక్ పంపొద్దని చెబుతున్నాయి. 

New Update
no stock

Trump Tariff Effect

రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే యుద్ధానికి సహాయం చేస్తున్నారు అనే నెపంతో భారత్ మీద 50 శాతం సుంకాలను విధించింది అమెరికా. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పేశారు. ఈ నెల 27 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఇది జరిగి రెండు రోజులు అవుతోంది. అయితే ఈ టారీఫ్ ఎఫెక్ట్ అప్పుడే మార్కెట్ల మీద పడింది.  ట్రంప్ పెంచిన సుంకాల కారణంగా అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువుల ధరలు పెరగనున్నాయి(Trump Tariffs On India). దీంతో అమెరికా ప్రజలపై భారం పెరగనుంది.

Also Read :  గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపారం

ట్రంప్ విధించిన అదనపు సుంకాల వలన ప్రభావితమయ్యే వస్తువుల్లో దుస్తులు ఒకటి. భారతదేశ వస్త్ర పరిశ్రమను ఈ సుంకాలు గట్టిగా దెబ్బతీస్తున్నాయి. అమెరికాకు మన దేశం నుంచి ఏటా సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన రెడీమేడ్ దుస్తులు ఎగుమతి అవుతాయి. భారత వస్త్రాలు, దుస్తులకు యునైటెడ్ స్టేట్స్ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం . మార్చి 2025 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో మన దేశం 28 శాతం వాటాను కలిగి ఉంది. దీని మొత్తం విలువ $36.61 బిలియన్లు. ఇప్పుడు భారత్‌పై ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, బంగ్లాదేశ్ కంటే ఎక్కువ సుంకాలు పడుతున్నాయి. దీంతో భారతీయ వస్త్ర ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీని ఎదుర్కోవడానికి కష్టపడుతున్నాయి.

టారీఫ్ ల భయంలో బడా కంపెనీలు..

అనుకున్నట్టుగానే భారత వస్త్ర పరిశ్రమ మీద అప్పుడే దెబ్బ పడింది. ట్రంప్ విధించిన టారీఫ్(Trump Tariffs) ల భయంతో దిగుమతులకు ఎక్కువ డబ్బు కట్టాల్సి వస్తుందని అక్కడి బడా కంపెనీలు భయపడుతున్నాయి. దీని కారణంగా స్టాక్ పంపించొద్దు అంటూ వాల్ మార్ట్, అమెజాన్, గ్యాప్, టార్గెల్ లాంటి పెద్ద కంపెనీలు భారత్‌ నుంచి స్టాక్‌ పంపించొద్దని టోకు వర్తకులకు లేఖలు, మెయిల్స్‌ పెడుతున్నారు. తదుపరి నోటీసులు వచ్చేవరకూ సరుకులను నిలిపివేయాలని చెప్పారు. కొనుగోలుదారులు ఖర్చు భారాన్ని పంచుకోవడానికి ఇష్టపడటం లేదని కంపెనీలు చెబుతున్నాయి. అధిక సుంకాల వల్ల ఖర్చులు 30 శాతం నుండి 35 శాతం వరకు పెరుగుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. దీని వలన అమెరికాకు వెళ్లే ఆర్డర్లు 40 శాతం నుండి 50 శాతం తగ్గుతాయి. ఈ కారణంగా దాదాపు $4-5 బిలియన్ల నష్టం వాటిల్లనుంది. మరోవైపు భారత్ నుంచి అధిక సుంకాలతో దుస్తులను దిగుమతి చేసుకుంటే తక్కువ సుంకాలున్న వియత్నాం, బంగ్లాదేశ్ లాంటి దేశాల ఆర్డర్లు కోల్పోతామని ఎగుమతిదారులు భయపడుతున్నారు. 

Also Read: RIC: భారత్, రష్యాలతో పాటూ యుద్ధంలోకి చైనా...అమెరికాకు మూడినట్టేనా..

Advertisment
తాజా కథనాలు