ఉక్రెయిన్‌ డ్రోన్ దాడులకు భయపడి.. రష్యా ఏం చేసిందో తెలుసా.?

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇటీవల ఆపరేషన్‌ ‘స్పైడర్‌ వెబ్‌’తో మాస్కోను హడలెత్తించింది. ఈక్రమంలో డ్రోన్‌ దాడుల భయంతో రష్యా ఆదివారం నావీ డే పరేడ్‌ను రద్దు చేసింది. భద్రతాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా వెల్లడించింది.

New Update
Russia cancels its main Navy Day parade

Russia cancels Navy Day parade

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇటీవల ఆపరేషన్‌ ‘స్పైడర్‌ వెబ్‌’తో మాస్కోను హడలెత్తించింది. ఈక్రమంలో డ్రోన్‌ దాడుల భయంతో రష్యా ఆదివారం తన యుద్ధనౌకల పరేడ్‌లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన అంశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్‌ వెల్లడించారు.

రష్యా గత నాలుగు రోజులుగా దాదాపు 150 యుద్ధనౌకలతో విన్యాసాలు నిర్వహించింది. నేవీ డే వార్షిక వేడుకలు పురస్కరించుకుని నేడు పోర్ట్ సిటీలైన సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, కాలినిన్‌గ్రాడ్‌, వ్లాదివొస్తొక్‌లలో యుద్ధనౌకల పరేడ్‌ నిర్వహించాల్సింది. అయితే.. సెక్యురిటీ కారణాలతో అధికారులు వీటిని రద్దు చేశారు. దేశాధినేత పుతిన్‌ ఇప్పటికే సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో పర్యటిస్తున్నారు. ఆయన నేవీ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. మరోవైపు ఉక్రెయిన్‌ ప్రయోగించిన 99 డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణశాఖ తెలిపింది. నేడు సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో మరిన్ని డ్రోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. డ్రోన్ల ముప్పుతో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని పుల్కోవో ఎయిర్ పోర్ట్ ఆదివారం విమానాలను నిలిపివేసింది. 

ukraine attacks russia | ukraine drone attack | ukraine drone attack on putin | putin | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు