Peter Navarro: మరోసారి రెచ్చిపోయిన పీటర్ నవార్రో..ఈ సారి ఎక్స్ పై కూడా..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీనియర్ సలహాదారు పీటర్ నవార్రో మరోసారి రెచ్చిపోయారు. భారత్ రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటూ ఎక్స్ ప్లాట్ ఫామ్ మీద కూడా మండిపడ్డారు. 

New Update
peter

The longtime Trump aide said Indian refiners are cashing in while fuelling the war..Peter Navarro

ట్రంప్ సీనియర్ సలహాదారు సీటర్ నవార్రో...ఇప్పటికీ ఈయన భారత్ పై చాలాసార్లు తీవ్ర విమర్శలతో దాడి చేశారు. తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి ఎక్స్ ప్లాట్ ఫామ్ లో వచ్చిన కమ్యూనిటీ నోట్ మీద ఆయన మండిపడ్డారు. ఎక్స్ లో చాలా మంది భారత్ కు సపోర్ట్ గా నిలిచారు. భారత్ చమురును కేవలం లాభం కోసం కాకుండా ఎనర్జీ సెక్యూరిటీ కోసం దిగుమతి చేసుకుంటోందని...దాని కోసం అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించడం లేదని చెప్పారు. అంతేకాకుండా అంతేకాక అమెరికా కూడా రష్యా నుంచి చమురుతో పాటూ కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటోందని గుర్తు చేశారు. చాలా మంది విశ్లేషకులు పీటర్ సవార్రో వైఖరిని ద్వంద్వ ధోరణిగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే అమెరికా సహా పాశ్చాత్య దేశాలు కూడా రష్యా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం న్యాయం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎక్స్ పైనా దాడి చేసిన నవార్రో..

ఎక్స్ లో నవారూ విమర్శలు ఆయన దాకా వెళ్ళాయి. దీంతో ఆయన మరోసారి భారత్ పై, దాంతో పాటూ ఎక్స్ కమ్యూనిటీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అంతా ప్రపగాండా అని.. భారత్ రష్యా చమురును కొనుగోలు చేయడం వల్ల ఉక్రెయినియన్లు చనిపోతున్నారని.. అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయని నవార్రో మండిపడ్డారు. రష్యా నుంచి భారత్ ముడి చమురును దిగుమతి  కేవలం లాభం కోసం మాత్రమే అని మరోసారి మాటలతో విరుచుకుపడ్డారు. భారత్ చమురు దిగుమతి..రష్యా యుద్ధ తంత్రాన్ని బలపరుస్తోందని అన్నారు. 

ఇంతకు ముందు కూడా నవార్రో భారత్ పై రెండు సార్లు ఘాటు విమర్శలు చేశారు.  సుంకాల్లో భారత్ మహారాజ్ వంటిదని చెప్పారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ న్యూ ఢిల్లీ లాభాలు గడించిందని..అమెరికాను మోసం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ వివాదానికి భారత్ ఆజ్యం పోస్తోందని అన్నారు. నిజానికి ఇండియాకు రష్యా చమురు అక్కర్లేదు. కేవలం అధిక లాభాలను ఆర్జించడానికే వారు ఆ దేశం నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి ముందు..భారత్ వాస్తవంగా రష్యన్ చమురును కొనుగోలు చేయలేదు. అప్పుడు కేవలం ఒక శాతం మాత్రమే చమురు దిగుమతి చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ శాతం  35కి పెరిగింది.  నిజానికి ఇండియాకు  చమురు అవసరం లేదు. కేవలం ఇది రెండు దేశాల మధ్యనా లాభాల భాగస్వామ్య పథకం మాత్రమే అని పీటర్ ఆరోపించారు. భారత్...క్రెమ్లిన్ కు లాండ్రో మాట్ లాంటిదని అన్నారు. సుంకాల విధింపు తర్వాత వారు రష్యాతో మరింత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. మరోవైపు చైనాతో కూడా స్నేహాన్ని పెంచుకుంటున్నారని పీటర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటూ భారత్ లో బ్రాహ్మణులపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  బ్రాహ్మణులు మిగిలిన భారత ప్రజల ఖర్చుతో లాభాలు పొందుతున్నారు. ఇది తక్షణమే ఆపాలని భారత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: SEAL Team 6 Mission: ఉత్తర కొరియాలో ట్రంప్ సీల్ టీమ్...పౌరుల మృతితో ఫెయిల్

Advertisment
తాజా కథనాలు