BIG BREAKING: అయ్యో యేసయ్యా.. చర్చ్‌పై కాల్పులో 21 మంది స్పాట్‌డెడ్

ఆఫ్రికా దేశం కాంగోలో ఇస్లామిక్‌ స్టేట్‌ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు చర్చి ప్రాంగణంలో జరిపిన దాడుల్లో దాదాపు 21 మంది మృతి చెందారు. తూర్పు కాంగో కోమాండాలోని ఓ క్యాథలిక్‌ చర్చిపై అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్‌ సభ్యులు ఆదివారం కాల్పులకు తెగబడ్డారు.

New Update
church in Congo

ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇస్లామిక్‌ స్టేట్‌ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఓ చర్చి ప్రాంగణంలో జరిపిన దాడుల్లో దాదాపు 21 మంది మృతి చెందారు. తూర్పు కాంగో కోమాండాలోని ఓ క్యాథలిక్‌ చర్చిపై అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్‌ (ఏడీఎఫ్‌) సభ్యులు ఆదివారం కాల్పులకు తెగబడ్డారు. ఈ హింసాత్మక ఘటనలో అనేక ఇళ్లు, దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి.

సాయుధ తిరుగుబాటుదారులు దాదాపు 21 మందిని కాల్చిచంపారు. 3 మృతదేహాలు కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. అదేవిధంగా అనేక ఇళ్లు దహనమయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగో సైనిక ప్రతినిధి సైతం ఈ దాడులను ధ్రువీకరించారు. ఈ దాడిలో 10 మంది మరణించినట్లు చెప్పారు.

Advertisment
తాజా కథనాలు