AP Assembly: 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..బడ్జెట్ కూడా! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి మొదలవుతున్నాయి. ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెట్టిన సర్కార్… ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది By Bhavana 03 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ap Assembly: ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అదే రోజు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక పద్దుతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేసింది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. Also Read: కెనడా ఇక ఆపదా..సైబర్ ముప్పు దేశాల జాబితాలో భారత్ పేరు నవంబర్ 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెట్టిన సర్కార్… ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది. తాజాగా ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా… పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. నవంబర్ 11వ తేదీన లేదా మరునాడు వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సారి అసెంబ్లీ సమావేశాలు పది రోజులకుపైగా జరిగే ఛాన్స్ ఉంది. Also Read: ఇదే మంచి అవకాశం.. భారీగా తగ్గిన బంగారం ధర ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడంతో పాటు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక ఇప్పటివరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నవంబర్ నెలాఖరుతో ముగుస్తుంది ఈ క్రమంలోనే… పూర్తిస్థాయి బడ్జెట్ కు సర్కార్ సిద్ధమైంది. Also Read: టీజీఆర్టీసీ గుడ్ న్యూస్..ఆ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు నిజానికి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఆర్థిక పరిస్థితి పై స్పష్టత వచ్చేందుకు గడువు తీసుకోవాల్సి వచ్చిందని వివరించాయి. అందుకు అనుగుణంగానే రెండోసారి కూడా ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. Also Read: రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి! నవంబర్ 6న కేబినెట్ సమావేశం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నేపథ్యంలో నవంబర్ 6వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల నిర్వహణతో పాటు బడ్జెట్ పై లోతుగా చర్చించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా… సభ ముందుకు తీసుకురావాల్సిన అంశాలు చర్చకు రానున్నాయి. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి