Pakistan - Afghanistan War: అఫ్గానిస్థాన్‌తో కటీఫ్‌...పాక్‌ సంచలన నిర్ణయం..

అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈక్రమంలో పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సంచలన ప్రకటన చేశారు. అఫ్గాన్‌తో ఉన్న అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

New Update
Pakistan Afghanistan war

Pakistan - Afghanistan War

Pakistan - Afghanistan War: అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈక్రమంలో పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సంచలన ప్రకటన చేశారు.  అఫ్గాన్‌తో ఉన్న అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read: Bigg Boss Promo: రెచ్చిపోయిన రీతూ.. డెమోన్ పవన్ గప్ చుప్! నామినేషన్స్ లో రచ్చ రచ్చ!

‘ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. శత్రుత్వాలు లేవని మీరు చెప్పొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి ప్రతికూలంగా ఉన్నాయి. నేటికి దానితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధాలు లేవు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వం తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా చర్చలకు అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు.. బెదిరింపులతో కూడిన చర్చలు సరికావని వివరించారు.  బెదిరింపులపై చర్యల అనంతరం చర్చలకు అంగీకరిస్తామన్నారు.

ఇది కూడా చూడండి: Telangana Rising Vision-2047 : రాష్ట్రంలో మరో సర్వే!.. తెలంగాణలో మరో సర్వే...తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 పేరిట ప్రారంభం

ఈసందర్భంగా పాక్‌ సైనిక ప్రతిస్పందనకు ఆసిఫ్‌ మద్దతివ్వడంతో పాటు దాడికి ప్రతిదాడి సహజమన్నారు. పౌరులను, వారు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదన్నారు. కేవలం వారి రహస్య స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఖవాజా తెలిపారు. అఫ్గాన్‌ పలు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు. అక్కడ అంతర్జాతీయ ఉగ్రవాదం ఉందని ప్రపంచానికి తెలుసని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (TTP) చీఫ్‌ నూర్‌ వలీ మోహ్సూద్ గురించి అడగ్గా.. తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి వారి భూభాగంలోనే ఉన్నారని ఆసిఫ్‌ బదులివ్వడం గమనార్హం. ఈ సందర్భంగా దౌత్య ప్రయత్నాలలో నిజాయతీ అవసరమని చెప్పుకొచ్చారు.

అన్ని దేశాలు మాతో సంతోషంగానే ఉన్నాయి.. 

ఇక పాక్‌, అఫ్గాన్‌ దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలపై అఫ్గానిస్థాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ మాట్లాడారు. పాక్‌ తప్ప.. పొరుగుదేశాలన్నీ తమతో సంతోషంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. తమకు ఎవరితోనూ గొడవలు అక్కర్లేదని తేల్చిచెప్పారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొందన్నారు. పాక్‌ మాత్రమే మా పొరుగుదేశం కాదని, మరో ఐదు దేశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అవన్నీ తమతో సంతోషంగానే ఉన్నాయన్నాయని స్పష్టం చేశారు.

Also Read: నువ్వేం తండ్రివి రా.. భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య


అయితే అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ భారత్‌లో పర్యటించడంపై రచయిత జావేద్‌ అక్తర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్‌ చేసిన చర్య వల్ల తాను సిగ్గుతో తల దించుకుంటున్నా అంటూ ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. బాలికల విద్యను పూర్తిగా నిషేధించిన వారిలో ఒకరికి.. ఇలాంటి గౌరవప్రదమైన స్వాగతం పలకడం సిగ్గు చేటు అంటూ ఆయన ఫైర్‌ అయ్యారు.

Also Read :  జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఊహించని షాక్.. 300 మంది మాలల నామినేషన్లు!

Advertisment
తాజా కథనాలు