కెనడాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులపై ఖలిస్థానీలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సీరియస్ అయ్యారు. అక్కడి ప్రజలు అన్ని మతాలు పాటించే హక్కులను కాపాడతామని అన్నారు. ఇలాంటి దాడులు జరగడం ఏమాత్రం సరికాదన్నారు. ఈ క్రమంలోనే బ్రాంప్టన్‌లో ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. మరోవైపు ఈ ఘటనపై భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read: కమలా హారిస్‌కు బిగ్ షాక్.. స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ హవా
భక్తులపై ఖలిస్థానీలు దాడులు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై పోలీస్ విభాగం ప్రతినిధి మాట్లాడారు. ఇప్పటివరకు తాము ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. అలాగే ఘర్షణలకు కూడా సరైన కారణాలు చెప్పలేకపోయారు. ఈ దాడులపై కెనడా ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నేత పియర్రె పొయిలీవ్రే కూడా స్పందించారు. ప్రతిఒక్కరికి కూడా మతవిశ్వాసాలు పాటించే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. తాను అధికారంలోకి వచ్చాక ఇలాంటి పరిస్థితులకు ముగింపు పలుకుతారని చెప్పారు.
Also Read : టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్!
మత స్వేచ్ఛ కెనడా మౌలిక విలువలకు చిహ్నం
మరోవైపు ఈ దాడులకు పాల్పడ్డ వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ హామీ ఇచ్చారు. ప్రజలకు మత స్వేచ్ఛ ఇవ్వడం అనేది కెనడా మౌలిక విలువలకు చిహ్నమని అన్నారు. ప్రతీ ఒక్కరూ కూడా వీళ్ల ప్రార్థన మందిరాల వద్ద సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. ఒంటారియో సిఖ్స్ అండ్ గురుద్వారా కౌన్సిల్ కూడా ఈ దాడులను ఖండించింది. హింసకు తమ మతంలో స్థానం లేదని తెలిపింది. ఈ అంశంపై స్థానిక అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది.
Also Read: దారుణం.. 29 మంది చిన్నారులకు ఉరి శిక్ష!.. ఆకలి ఎంతపని చేసింది!
భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేయడం తీవ్ర నిరాశపరిచిందని ఒట్టావాలోని ఇండియన్ హై కమిషన్ కూడా పేర్కొంది. దీని వెనుక భారత వ్యతిరేక శక్తులున్నాయని ఆరోపణలు చేసింది. ఇదిలాఉండగా గత కొన్ని నెలలుగా కూడా కెనడాలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. గత ఏడాది విండ్‌సోర్‌లోని ఆలయ గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాయడం తీవ్ర దుమారం రేపింది.
Also Read : మెదక్‌లో దారుణం.. ప్రేమించలేదని యువతిని ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే?