/rtv/media/media_files/2026/02/25/prime-minister-modi-lands-in-israe-2026-02-25-19-06-19.jpg)
Prime Minister Modi Lands in israe
ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. బెన్గురియన్ ఎయిర్‌పోర్టులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు రావడం ఇది రెండోసారి. 2017లో ఓసారి ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో మోదీ.. ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఏ భారత ప్రధాని కూడా ఇప్పటివరకు ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఇలా ప్రసంగం చేయలేదు. మొదటిసారి ఇలా ప్రసంగం చేయనున్న భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. ఈ వేదికగా ఇరువురు ప్రధానమంత్రులు గాజా పరిస్థితులు, పశ్చిమాసియాకు సంబంధించిన వివిధ విషయాల గురించి చర్చించనున్నట్లు తెలిస్తోంది. అలాగే ప్రవాస భారతీయులతో మోదీ మాట్లాడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Also read: ఇండియాకు ట్రంప్ 'బిగ్ షాక్'.. మళ్లీ మొదలైన ట్రేడ్ వార్.. వాటిపై 126% సుంకాలు!
మోదీ పర్యటనపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. మోదీ, నెతన్యాహు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. వీళ్లిద్దరి దీర్ఘకాల స్నేహం ఇరు దేశాల సంబంధాలను ప్రతిబింబిస్తున్నాయంటూ రాసుకొచ్చింది. ఇక పార్లమెంటులో మోదీ ప్రసంగం ఇచ్చిన తర్వాత నెతన్యాహు ఆయనకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గురువారం వీళ్లద్దరూ ఇరుదేశాలకు సంబంధించి ఆర్థిక, భద్రత, దౌత్య తదితర రంగాల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.
🇮🇳🇮🇱 Narendra Modi met Israeli PM Benjamin Netanyahu.
— Rise Bharat (@RiseBharat_News) February 25, 2026
Netanyahu said this is a “bond of real friendship” between India and Israel. 🤝#IndiaIsrael#Diplomacypic.twitter.com/3uhnIpbNXi
ఇరుదేశాల మధ్య జరగనున్న ఒప్పందాలు
భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న 'సుదర్శన్ చక్ర' ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో ఇజ్రాయెల్‌కు చెందిన 'ఐరన్ డోమ్' టెక్నాలజీని జోడించడంపై చర్చలు జరగనున్నాయి. ఇరుదేశాల మధ్య వర్తక వాణిజ్యాలు పెంచేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై తుది దశ చర్చలు జరపనున్నాయి. దీంతో భారత్, ఇజ్రాయెల్ మధ్య ఎగుమతులు, దిగుమతులు సులభతరం కానున్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగంలో ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉంది.
ఇజ్రాయెల్‌కు చెందిన అడ్వాన్స్డ్ డ్రిప్ ఇరిగేషన్, సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే టెక్నాలజీని భారత్‌లో మరింత విస్తరించేలా చర్చలు జరగనున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, గాజా, ఇరాన్ అంశాలపై కూడా ఇరుదేశాధినేతలు లోతుగా చర్చలు జరపనున్నారు.
Follow Us