అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా మధ్యలోనే సడెన్ గా ఆగిపోయింది. అందుకు కారణం ఒక అమ్మాయి ప్రెస్ మీట్ మధ్యలో స్పృహ తప్పిపడిపోవడమే. శుక్రవారం సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసెస్ (CMS) కొత్త అధిపతిగా ఓజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం తరువాత అధ్యక్షుడు ట్రంప్ మీడియానుద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సమయంలోనే ఓజ్ కుమార్తె స్పృహ తప్పి పడిపోయింది. దాంతో వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఆపేయాల్సి వచ్చింది.
ట్రంప్ మాట్లాడుతుండగా..
పడిపోయిన బాలిక ఓజ్ కుమార్తె అని చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని వైట్ హౌస్ తెలిపింది. అయితే ఆ అమ్మాయి స్పృహ కోల్పోవడానికి కారణమేంటో మాత్రం తెలియలేదు. ఓజ్ ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ మీడియాతో చైనాపై వాణిజ్య యుద్ధం గురించి మాట్లాడారు. ఈ యుద్ధం ఆగేది లేదని చెప్పారు. దాంతో పాటూ ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ట్రంప్ అన్నారు. ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడుతుండగానే ఆ అమ్మాయి స్పృహ తప్పిపడిపోయింది. ఇక సీఎమ్ఎస్ కొత్త అధ్యక్షుడు ఓజ్ ఓ కార్డియాలజిస్ట్ . ఈయనకు 65 ఏళ్ళు. మెడికేర్, మెడికైడ్ లేదా అఫర్డబుల్ కేర్ యాక్ట్ కవరేజీని పర్యవేక్షిస్తారు.
today-latest-news-in-telugu | america president donald trump | media | press-conference
Also Read: UP: అత్యాచారం చేశాడని..నగ్నంగా మార్చి, ఎడ్లబండికి కట్టి..