PM Modi Brazil Award: ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం

భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది.దీని తర్వాత ఘనా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి. 

New Update
brazil

PM modi conferred with brazil highest civilian award

PM Modi Brazil Award: ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా బ్రెజిల్‌లో పర్యటించారు(C). రియో డి జనీరో(Rio de Janeiro)లో జరిగిన 17వ బ్రిక్స్ సదస్సు(17th BRICS Summit)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రెజిల్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ సదర్న్ క్రాస్ తో(PM Modi Brazil Highest Civilian Award) ప్రధాని మోదీని సత్కరించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడానికి ప్రధాని చేసిన కృషికి గానూ దీనిని ఆయనకు ప్రదానం చేశారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా  దీనిని మోదీకి ప్రదానం చేశారు. దీని తరువాత మోదీ మాట్లాడుతూ ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా 140 కోట్లమంది భారతీయులకూ గర్వకారణమని, ఇవి ఉద్వేగపూరిత క్షణాలని అన్నారు. అన్ని వివాదాలనూ చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది తమ ఏకాభిప్రాయమని చెప్పారు. ఇలాంటి విదేశీ పురస్కారాలను ప్రధాని అందుకోవడం ఇది 26వసారి. 

ప్రధానికి ఘన స్వాగతం..

బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీకి రియో డీ జనీరో నుంచి బ్రెజిల్ కు వచ్చిన మోదీకి 114 అశ్వాల కవాతుతో స్వాగతం లభించింది. అలాగే అక్కడి కళాకారులు కూడా ఆయన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. దీని తర్వాత ఇరు ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాధినేతలూ చర్చించుకున్నారు. పర్యావరణం, శుద్ధ ఇంధనం రెండు దేశాలకూ ప్రధానాంశాలని...రాబోయే ఐదేళ్ళల్లో వాణిజ్యాన్ని 2 వేల కోట్ల డాలర్లకు చేర్చడమే లక్ష్యమని చెప్పారు. రక్షణ రంగంలో ఇండియా, బ్రెజిల్ సహకారం మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని ఇరు దేశాధినేతలు తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఔషధాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై నేతలు చర్చించుకున్నారు. వీటికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. 

Also Read: Trump Tariffs: రాగిపై 50, ఫార్మాపై 200శాతం సుంకాలు..భారత్ పై భారీ ఎఫెక్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు