/rtv/media/media_files/2025/04/17/IHNfpcTDmoikjtiwG3SC.jpg)
హృదయ విదారకరమైన ఫొటో అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైంది. రెండు చేతులూ కోల్పోయిన బాలుడు దీనంగా కుర్చున్న అతని పిక్ చూసిన వాళ్లకు కనీళ్లు ఆగవు. తొమ్మిదేళ్ల ఈ పాలస్తీనా కుర్రాడు గాజాలో జరుగుతున్న మారణహోమానికి నిదర్శనం. సమర్ అబూ ఎలోఫ్ అనే ఫొటో జర్నలిస్ట్‌కు 2025 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. ప్రెస్ ఫోటో అవార్డు కోసం 59,320 ఎంట్రీలు వచ్చాయి. సుమారు 3778 మంది ఫొటో జర్నలిస్టులు వీటిని పంపించారు. అయితే పాలస్తీనా కుర్రాడి పోట్రేయిట్ ఫోటోను వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు.
Thank you to the photo editors at The New York Times @nytimes , and thank you to World Press Photo @WorldPressPhoto . https://t.co/qfJn2JATj8
— Samar Abu Elouf (@samarabuelouf) April 17, 2025
సమర్ అబూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పని చేస్తున్నారు. ఫోటోలో ఉన్న తొమ్మిదేళ్ల కుర్రాడి పేరు మహమూద్ అజ్జౌర్. ప్రస్తుతం ఆ బాలుడు దోహ, ఖతార్‌లో చికిత్స పొందుతున్నాడు. గాజా యుద్ధంలో పేలుడు వల్ల మహమూద్‌కు రెండు చేతులు పోయి ఈ దుస్థితి వచ్చింది. అతనికి జరిగిన ప్రమాదం గురించి మహమూద్ తల్లి వివరించింది. ఈ ఫోటో చాలా ఎమోషన్ ఉందని వరల్డ్ ప్రెస్ ఫోటో జ్యూరీ మెచ్చుకున్నది. యుద్ధాల వల్ల చిన్నారులపై పడే దీర్ఘకాలిక ప్రభావం ఇదే అన్న రీతిలో ఈ ఫోటోను తీసినట్లు జ్యూరీ తెలిపింది. ప్రస్తుతం బాధితుడు తన కాళ్లతో ఆడడం, రాయడం, డోర్లు ఓపెన్ చేయడం లాంటివి నేర్చుకుంటున్నాడు. త్వరలో అతనికి ప్రోస్థటిక్స్ చేతులను అమర్చనున్నారు.