USA: భారతీయులపై జాత్యాంహకార వ్యాఖ్యలు..ఆఫీస్‌ ఆఫ్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ హెడ్‌ నామినేషన్ నుంచి నామినీ ఔట్

భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేస్తూ విషం కక్కిన నామినీ పాల్ ఇంగ్రాసియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆఫీస్‌ ఆఫ్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ హెడ్‌గా పాల్‌కు రిపబ్లికన్ల నుంచి మద్దతు లభించలేదు. దీంతో నామినీ తన నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు. 

New Update
paul

నాకు రిపబ్లికన్ల నుంచి మద్దతు లభించలేదు. అందకే నా నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నా అంటూ నామినీ పాల్ ఇంగ్రాసియా తెలిపారు. నా నామినేషన్‌ను సెనేట్ ప్యానెల్‌కు ఇవ్వలేదని చెప్పారు. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పని చేయడం మాత్రమం మానను అని..అమెరికా అభివృద్ధి కోసం పని చేస్తూనే ఉంటానని నామినీ తెలిపారు. మరోవైపు నామినీ గురించి వైట్ హౌస్ కూడా ప్రకటించింది. జాత్యహంకార మాటలు మాట్లాఇన కారణంగా ఇంగ్రాసియా నామినేషన్‌ను వైట్‌హౌస్ వెనక్కి తీసుకుంటుందని సెనెట్‌ మెజార్టీ నాయకుడు జాన్‌ థూన్‌ చెప్పారు. 

భారతీయులతో చాటింగ్ చేసేవారిని నమ్మకూడదు..

భారతీయులపై ఈ మధ్య కాలంలో ఇద్దరు అమెరికన్లు జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. అందులో పాల్ ఇంగ్రాసియా ఒకరు. తోటి రిపబ్లికన్లతో చేసిన చాటింగ్‌లో భారతీయులను నమ్మకూడదంటూ వారిని ఎప్పటికీ మార్చలేమంటూ పాల్ అన్నారు. దేశంలోని ఉన్నతస్థానాల్లో శ్వేతజాతీయులు మాత్రమే ఉండాలని, నల్ల జాతీయుల విషయంలో తనకు నాజీ తరహా ఆలోచనలు వస్తాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు లీక్ అయ్యాయి. దాంతో ఇవి ఫుల్ సెన్సేషనల్ అయ్యాయి. భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి గురించే పాల్ ఈ మాటలు అన్నారని తెలుస్తోంది.  

ఇతనితో పాటూ ఫ్లొరిడాలోని కన్జర్వేటివ్‌ నేత చాండ్లర్‌ లాంగేవిన్‌.. అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ పోస్టు చేశారు. ఆయనపై తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. దీంతో పామ్‌ బే నగర కౌన్సిల్‌ ఆయనపై చర్యలు తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత నెల నుంచి లాంగేవిన్ భారతీయులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఓ భారతీయ ట్రక్‌ డ్రైవర్‌ వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న భారతీయులందరినీ వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మరో పోస్టులో  అమెరికా గురించి పట్టించుకునేందుకు ఒక్క భారతీయుడు కూడా రాలేదన్నారు. ఆర్థికంగా వాళ్లు మనల్ని దోపిడి చేస్తున్నారని.. ఈ దేశం అమెరికన్ల కోసం మాత్రమేనని రాసుకొచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలను పామ్‌ బే మేయర్ తప్పుబట్టారు. ఇతరులను కించపభారతీయులను బహిష్కరించాలి: అమెరికా నేత సంచలన వ్యాఖ్యలురిచేలా, విలువలను త్గగించేలా మాట్లాడకూడదని.. అలాంటి వాళ్లకి ఇక్కడ చోటు లేదంటూ ఘాటుగా స్పందించారు.  అయినా కూడా లాంగేవిన్ భారతీయులకు వ్యతిరేకంగా పోస్టులు చేయడం ఆపలేదు.   

Also Read: Women's World Cup: భారత్‌లోనే మహిళల వరల్డ్‌కప్ ఫైనల్..నాలుగో స్థానం కోసం టీమ్ ఇండియా ప్రయత్నం

Advertisment
తాజా కథనాలు