/rtv/media/media_files/2025/10/12/paramilitary-massacre-in-sudan-2025-10-12-08-17-58.jpg)
Paramilitary massacre in Sudan..
Sudan Army Vs Paramilitary Forces Conflict : సూడాన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పారామిలిటరీ దళాలు మరోసారి రెచ్చిపోయాయి. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో 60 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. కైరోలోని డార్సర్ నగరంలో ఉన్న ఒక శరణార్థి శిబిరంపై సూడాన్ పారామిలిటరీ దళాలు విచక్షణ రహితంగా జరిపిన దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది పిల్లలు ఉన్నారు. ఎల్ ఫాషెర్ నగరంలో నిర్వాసితులు తలదాచుకుంటున్న భవనంపై మిలిటరీ దళాలు జరిపిన దాడిలో ఐదుగురు పిల్లలు, ఏడుగురు మహిళలతో సహా 21 మంది గాయపడ్డారు. దర్ఫూర్‌లోని అల్ అర్ఖామ్ హోమ్ అనే శరణార్థి శిబిరంపై దళాలు దాడిజరిపి విధ్వంసం సృష్టించినట్లు వైద్యుల బృందం ప్రకటించింది.
డార్సర్ నగరాన్ని ముట్టడించిన సూడాన్ పారామిలిటరీ కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. డ్రోన్లు, ఫిరంగులతో సూడాన్ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో మృతిచెందిన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.ఉత్తర డార్ఫర్ ప్రావిన్స్ పరిపాలనా కేంద్రమైన ఎల్-ఫాషర్‌లో వలస కుటుంబాలకు నివాసంగా ఉన్న అల్-అర్కామ్ హోమ్‌ను రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ లక్ష్యంగా చేసుకున్నట్లు సుడాన్ డాక్టర్స్ నెట్‌వర్క్ నివేదించింది. ఈ ఆశ్రయం ఓమ్‌దుర్మాన్ ఇస్లామిక్ యూనివర్శిటీ ప్రాంగంణలో ఉంది. కాగా, ఎల్‌ఫాషర్ ప్రాంతం చాలా నెలలుగా సూడాన్ సైన్యం, పారామిలిటరీ గ్రూపుల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఈ ప్రాంతంలో తరుచుగా ఇరువర్గాలు దాడులు చేసుకుంటాయి. తాజాగా పారామిలటరీ దాడిలో 60 మంది చనిపోయిన ఘటనపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read : వరంగల్ కాంగ్రెస్‌లో మరోసారి ముసలం.. పొంగులేటి vs కొండా మురళి