Pakistan Rains : పాకిస్తాన్ లో వరదలు బీభత్సం.. 657 మంది మృతి

పాకిస్తాన్ అంతటా ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అత్యంత తీవ్రంగా దెబ్బతింది. వరదల వలన మొత్తం గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి.  వందలాది మంది గల్లంతయ్యారు.

New Update
pakistan

పాకిస్తాన్ అంతటా ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అత్యంత తీవ్రంగా దెబ్బతింది. వరదల వలన మొత్తం గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి.  వందలాది మంది గల్లంతయ్యారు. ఇళ్ళు, వాహనాలు కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులుచెబుతున్నారు. పాకిస్తాన్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు వలన  జూన్ 26 నుంచి ఇప్పటివరకు దాదాపు 657 మంది ప్రాణాలను కోల్పోయారు.  వీరిలో చాలా మంది పిల్లలు ఉన్నారు.   929 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) తెలిపింది. అత్యంత దారుణంగా ప్రభావితమైన జిల్లాలలో బునెర్ ఒకటి. ఇక్కడ మొత్తం గ్రామాలు, ముఖ్యంగా బషోని అనే గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని అధికారులు వెల్లడించారు. వరదల్లో ఇళ్లు, దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి.

Also Read :  ChatGPT Plus, Pro Plans: చాట్‌జీపీటీ యూజర్స్ కు షాకింగ్ న్యూస్..

బతికే అవకాశాలు చాలా తక్కువ

బునెర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 25 మంది మరణించిన సంఘటన కూడా ఉంది.  నీటి ప్రవాహం ఎంత బలంగా ఉందంటే, ఇళ్ల శిథిలాల కింద చిక్కుకున్న వారు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వం, సహాయక బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రక్షించడానికి, వారికి ఆహారం, నీరు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే, రోడ్లు ధ్వంసం కావడం వల్ల సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. పాకిస్తాన్ వాతావరణ మార్పుల వల్ల తరచుగా ఇలాంటి విపత్తులకు గురవుతోంది. ఈసారి కురిసిన వర్షాలు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇది ఈ భారీ విధ్వంసానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పాక్ లో మరికొన్ని రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతారవరణ శాఖ వెల్లడించింది. 

Also read :  Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ

Also Read :  Crime: అయ్యో .. కూతురి అప్పగింతలు చేస్తూ.. ఆగిపోయిన తల్లి గుండె! పెళ్లి వేడుకలో విషాదం

Advertisment
తాజా కథనాలు