/rtv/media/media_files/2025/05/20/W26mofNvMke11IxHIbcw.jpg)
jyt ml Photograph: (jyt ml)
Jyoti Malhotra: పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా గురించి మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. ఉగ్రవాదులు వీడియోలు ఎలా తీయాలో ఆమెకు శిక్షణ ఇచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 4నెలల్లో 10రాష్ట్రాలు తిరిగిన ఆమె 30కిపైగా నగరాల సున్నితమైన సమాచారం వారికి పంపించినట్లు అనుమానిస్తున్నారు.
మూడు భాగాలుగా వీడియోలు..
ఈ మేరకు పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఏ ప్రదేశంలో ఏ కెమెరాను ఉపయోగించాలో ఆమె పూర్తి శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏ ప్రదేశాల్లో ఏమేమీ చూపించాలో కూడా స్పష్టంగా తెలుసుకున్నట్లు బయటపడింది. అరెస్టుకు ముందు పాకిస్తానీ గూఢచారి జ్యోతి మల్హోత్రా 4 నెలల్లో 10 రాష్ట్రాలు, 30కి పైగా నగరాలకు ప్రయాణించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆమె విదేశాలకు కూడా వెళ్లింది. జ్యోతి తను రికార్డు చేసిన సందేశాన్ని మూడు విధాలుగా పంపించేది. మొదటి వీడియో బ్లాగ్ వ్యవధి అరగంట. రెండవది 1 నిమిషం. మూడవది లైవ్ చాట్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు.
Also Read : బార్డర్లో వరంగల్ జవాన్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని.. కారణం అదేనా?
సెల్ఫీ మోడ్ లేని ఫొటోలు..
జ్యోతి తాను సందర్శించిన చాలా ప్రదేశాలలో లైవ్ చాట్ చేసేది. ఇందులో అభిమానులు ప్రశ్నలు అడిగేవారు. ఇందులోనూ చాలా మంది పాకిస్తాన్ వారే. వీరంతా స్థలాల వివరాల గురించి ప్రశ్నలు అడిగేవారు. జ్యోతి ఈ ప్రశ్నలన్నింటికీ వివరంగా సమాధానం చెప్పేది. దీని ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లు తమకు కావాల్సిన సమాచారం తీసుకునేవారు. రెండవ వీడియో వ్లాగ్.. జ్యోతి మల్హోత్రా వీడియోలకు ఇతర యూట్యూబర్ల వీడియోల కంటే వ్యవధి ఎక్కువ. ఆమె ప్రయాణానికి బదులుగా, వంతెనలు, రోడ్లు, సున్నితమైన మార్గాలతో సహా చుట్టుపక్కల ప్రాంతాన్ని చూపించింది. అంతేకాదు జ్యోతి ఫోన్ సెల్ఫీ మోడ్‌లో ఉండేది కాదు. ఆమె తన వీడియోలను షూట్ చేసేటప్పుడు ఆమె వెనుక ఉన్న బోర్టులపై రాత స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉండేలా జాగ్రత్త పడేలా చూసుకునేదట. దర్యాప్తులో ఈ వివరాలన్ని అధికారులు గుర్తించినట్లు జాతీయా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Also Read : కేసీఆర్ కు జైలు తప్పదా? కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్!
ఏఏ ప్రదేశాలు చూపించింది?
ఈ 5 నెలల్లో నాగాలాండ్, గౌహతి, బనారస్, ప్రయాగ్‌రాజ్ కుంభ్, కాశ్మీర్, కేరళ, బీహార్, ఒరిస్సా తిరిగింది. సాధారణంగా యూట్యూబర్లు లేదా ట్రావెల్ బ్లాగర్లు చాలా తక్కువ సమయంలో ఇన్ని ప్రదేశాలను సందర్శించడం చాలా అరుదు. జ్యోతి మల్హోత్రా సందర్శనలు మాత్రం సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం జరిగాయని నిఘా అధికారులు భావిస్తున్నారు. మహా కుంభమేళాకు వెళ్తుండగా ఢిల్లీ నుండి ప్రయాగ్‌రాజ్ మొత్తం రోడ్డు మార్గాన్ని చూపించింది. ఆమె మహా కుంభమేళాలో రద్దీగా ఉండే వంతెనలనే రికార్డు చేసింది. తన వేళ్లతో ఎవరినో చూపిస్తున్నట్లుగా కనిపించింది. బనారస్ నుండి వెళ్ళినప్పుడల్లా ఘాట్ల గురించి సమాచారం ఇచ్చింది. బీహార్ నుండి నాగాలాండ్ కు తన ప్రయాణంలో జ్యోతి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ చూపించింది.
JYOTHI MALHOTRA | telugu-news | today telugu news