BIG BREAKING: 9 మంది పాకిస్థాన్ ఆర్మీ జవాన్లు మృతి

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. మంగళవారం జరిగిన భయంకరమైన దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులు దుర్మరణం పాలయ్యారు. బలూచిస్తాన్‌లోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో అటాక్ జరిగింది.

New Update
Balochistan

Attack on Pakistani in Balochistan

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. మంగళవారం జరిగిన భయంకరమైన దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సైనిక వర్గాలు తెలిపాయి.

దాడి వివరాలు

బలూచిస్తాన్‌లోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో అటాక్ జరిగింది. ఉగ్రవాదులు సైనికుల కాన్వాయ్‌పై మెరుపుదాడికి పాల్పడ్డారు. జవాన్లు వెళ్తున్న మార్గంలో బాంబులు అమర్చి వాటిని బాస్ట్ చేశారు. ఆ తర్వాత సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే, ఈ ప్రాంతంలో తరచుగా దాడులకు పాల్పడే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) లేదా తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఈ దాడి చేసి ఉండవచ్చని పాకిస్తాన్ అధికారులు అనుమానిస్తున్నారు.

బలూచిస్తాన్‌లో పెరుగుతున్న హింసపై పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు బలూచ్ తీవ్రవాదులు వ్యతిరేకంగా ఉన్నారు. విదేశీ పెట్టుబడులు, సైనిక ఉనికి తమ సంస్కృతి, జీవన విధానానికి ముప్పు అని వారు భావిస్తున్నారు. ఈ కారణంగానే బలూచ్ తీవ్రవాద సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచుగా దాడులు జరుపుతున్నాయి. పాకిస్తాన్ ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ ఉగ్రదాడి దేశ అంతర్గత భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు, పంజాబ్, బలూచిస్తాన్ వంటి ప్రావిన్స్‌లలో పెరుగుతున్న తీవ్రవాదం పాకిస్తాన్‌కు ఒక పెద్ద సవాలుగా మారాయి.

Advertisment
తాజా కథనాలు