Pakistan: ఆఫ్ఘనిస్థాన్‌పై యుద్ధం తప్పదు..పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఆఫ్ఘనిస్థాన్ తమతో ఒప్పందానికి రాకపోతే బహిరంగ యుద్ధం తప్పదు అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మాటలు అన్నారు. 

New Update
khawaja asif

khawaja asif

పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మధ్య రీసెంట్‌గా యుద్ధ వాతావరణం నెలకొంది. అరబ్ దేశాల జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ చేశారు. కానీ ఇద్దరి మధ్యనా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న చర్చలు విఫలమైనా, ఒప్పందం కుదరకపోయినా బహిరంగ యుద్ధం తప్పదంటూ హెచ్చరించారు. మాకు ఆ అవకాశం ఉందంటూ ఖవాజా చెప్పారు.ఆఫ్ఘనిస్థాన్ ఆ పరిస్థితి తెచ్చుకోదని...వారు శాంతిని కోరుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. 

ఖతార్, టర్కీ సమక్షంలో కాల్పుల విరమణ..

దాదాపు పది రోజులు పాక్, ఆఫ్ఘాన్‌లు ఎడతెగని దాడులు చేసుకున్నాయి. అటు పాకిస్తాన్ సైన్యం, ఇటు తాలిబన్లు డజన్ల కొద్దీ మరణించారు. ముఖ్యంగా ఆఫ్ఘాన్ క్రికెటర్లు ముగ్గురిని పాకిస్తాన్ పొట్టన పెట్టుకుంది. దీంతో ఖతార్, టర్కీ వంటి దేశాలు జోక్యం చేసుకోవలసి వచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. తన వరకు వస్తే యుద్ధాన్ని కచ్చితంగా ఆపుతానని చెప్పారు. అయితే ఈ లోపునే ఖతార్, టర్కీల సమక్షంలో పాక్, ఆఫ్ఘన్‌లు కాల్పులు విరమణ ఒప్పదం చేసుకున్నాయి. కాబూల్ రక్షణ మంత్రి ముహమ్మద్ యాకూబ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ప్రతినిధి బృందాలు దోహాలో సమావేశంలో పాల్గొన్నాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉద్భవిస్తున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో శాంతి మరియు స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి తక్షణ చర్యలపై చర్చించారు. 

Also Read: Delhi: గొంతునొప్పి, ఆస్త్మాలతో బాధపడుతున్న ఢిల్లీ వాసులు..ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

Advertisment
తాజా కథనాలు