/rtv/media/media_files/2025/09/19/indian-stores-2025-09-19-08-27-42.jpg)
భారత్ పై అమెరికా విధించిన సుంకాలు...మన దేశంపై ఎంత ప్రభావం చూపించాయో లేదో కానీ అమెరికాలో భారతఈయ వ్యాపారులను మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అమెరికాలో ప్రతీ చోటా కచ్చితంగా ఇండయన్ గ్రోసరీ ఉంటుంది. వీళ్ళకు వస్తువులన్నీ భారత్, మెక్సికోల నుంచే ఎక్కువగా వస్తాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక మెక్సికో, భారత్ రెండు దేశాలపైనా భారీగా టారీఫ్ లను విధించారు. దీంతో అమెరికాలో భారతీయ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిపై ఆర్థిక భారం బాగా పడుతోంది.
భారమవుతున్న దిగుమతి సుంకాలు..
అమెరికాలో సుగంధ ద్రవ్యాలు కావాలంటే..భారత్ నుంచి తెప్పించుకోవాల్సిందే. అయితే ట్రంప్ సుంకాలు విధించడం మొదలుపెట్టాక భారత్ నుంచి ఈ వస్తువులను తెచ్చుకోవడం చాలా కష్టంగా మారింది. దిగుమతి సుంకాలు ఎక్కువ పడడంతో వీటి ధర బాగా పెరిగిపోయింది. దాంతో పాటూ ఫ్యాషన్, రిటైల్ రంగాలను కూడా తీవ్రంగా దెబ్బ తీశాయి. దిగుమతి సుంకాలు భారీగా పడుతున్న...వస్తువులపై ధరలను పెంచడానికి వీలు లేదు. దీని వలన అమెరికాలో ఇండియా గ్రోసరీలను రన్ చేయడానికి కష్టమైపోతోందని అక్కడి భారతీయులు చెబుతున్నారు. మేము పెద్ద ఎత్తున వస్తువులను దిగుమతి చేసుకోవడానికి వీలు లేదు. ఇక్కడ ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము. అలా అని తరుచుగా దిగుమతులను చేసుకోలేము. అది తడిసి మోపెడు అవుతఉంది. దీంతో ఏం చేయాలో తెలఇయడం లేదని చెబుతున్నారు.
కుదేలయిన బొటిక్ వ్యాపారులు..
అలాగే అమెరికాలో ఫ్యాషన్ వ్యాపారాలను చేస్తున్న భారతీయులు కూడా ఇవే ఇబ్బందులను ఎదుర్కొంటున్నఆరు. తమకు వస్తున్న డబ్బులన్నీ దిగుమతి సుంకాలను చెల్లించుకోవడానికే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఇప్పుడు చాలా మంది తమ బొటిక్ లను మూసేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పుడు అమెరికాలో బట్టలు కొనుక్కోవడం కంటే..భారత్ నుంచి తెప్పించుకోవడం లేదా..అక్కడికి వెళ్ళి బట్టలు కొనుక్కోవడం చవక అవుతోందని వాపోతున్నారు.
సుంకాలు తగ్గుతాయ్..
మరోవైపు నవంబర్ తర్వాత ట్రంప్ 25శాతం సుంకాలు వెనక్కి తీసుకునే అవకాశం ఉందని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తున్న సుంకాల వివాదంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధించిన అదనపు 25 శాతం సుంకం నవంబర్ 30 తర్వాత ఉండకపోవచ్చని ఆయన అన్నారు.గత కొన్ని వారాలుగా పరిస్థితుల్లో సానుకూల మార్పులు వస్తున్నాయని, అందువల్ల ఈ అదనపు సుంకాలు త్వరలోనే రద్దు అవుతాయని నాగేశ్వరన్ నమ్మకం వ్యక్తం చేశారు. భారత్ పై సుంకాలు తగ్గితే...అమెరికా లో భారతీయ వ్యాపారుల మీద కూడా భారం తగ్గవచ్చును.
Also Read: Pakistan: భారత్ పై అక్కసుతో పాక్ బలుపు ప్రదర్శన..శిక్ష తప్పదంటోన్న ఐసీసీ