పాక్ కుట్రని తిప్పికొట్టిన రష్యా.. S-400 టెక్నాలజీ చోరీకి ISI ప్లాన్

పాకిస్తాన్ ISI రష్యా సైనిక సాంకేతికతను దొంగిలించడానికి పన్నిన కుట్రని మాస్కో భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పాకిస్తాన్ రష్యా కీలకమైన వైమానిక రక్షణ వ్యవస్థల టెక్నాలజీని, మిలిటరీ హెలికాప్టర్లకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.

New Update
After China, Russia joins US in nudging India to restart stalled dialogue with Pakistan

After China, Russia joins US in nudging India to restart stalled dialogue with Pakistan

పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) రష్యా సైనిక సాంకేతికతను దొంగిలించడానికి పన్నిన ప్లాన్‌ను మాస్కో భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఐఎస్‌ఐ ఆపరేషన్‌లో రష్యా కీలకమైన వైమానిక రక్షణ వ్యవస్థల టెక్నాలజీని, మిలిటరీ హెలికాప్టర్లకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.

రష్యా కౌంటర్-ఎసిపయోనేజ్ ఆపరేషన్‌లో భాగంగా, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఓ రష్యన్ జాతీయుడిని అరెస్టు చేశారు. ఈ వ్యక్తి మిలిటరీ హెలికాప్టర్ సాంకేతికత అభివృద్ధికి ఉపయోగించే పత్రాలను, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా దేశం దాటించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది.

ఐఎస్‌ఐ నెట్‌వర్క్ దొంగిలించడానికి ప్రయత్నించిన సాంకేతికతలో Mi8AMTShV, MI8 AMTShV (VA) మిలిటరీ రవాణా హెలికాప్టర్లకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. Mi8AMTShV అనేది Mi8AMTSh 'టెర్మినేటర్' లేటెస్ట్ ఆర్మీ హెలికాప్టర్ అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఇక MI8 AMTShV (VA) అనేది ఆర్కిటిక్ ఆపరేషన్ల కోసం రూపొందించబడిన ప్రత్యేక వెర్షన్. వీటితో పాటు, రష్యా రూపొందించిన అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S 400కు సంబంధించిన టెక్నాలజీ కూడా దొంగిలించడానికి ప్రయత్నించినట్లు రష్యా వర్గాలు పేర్కొన్నాయి.

భారత వైమానిక దళం ఉపయోగిస్తున్న రష్యన్ తయారీ S-400 క్షిపణి రక్షణ వ్యవస్థలు ఈ నెట్‌వర్క్ టార్గెట్‌లో ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వ్యవస్థలు 'ఆపరేషన్ సింధూర్'లో కీలక పాత్ర పోషించాయని, అందువల్ల ఈ వ్యవస్థల సాంకేతికతను దొంగిలించడానికి ఐఎస్‌ఐ ప్రయత్నించిందని సమాచారం. ఈ గూఢచార ఆపరేషన్ భగ్నం కావడంతో రష్యా రక్షణ రంగం సేఫ్ అయ్యింది. ఆర్మీ టెక్నాలజీ చోరీకి యత్నించిన ఈ నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది.

Advertisment
తాజా కథనాలు