BIG BREAKING: LOC దగ్గర పాకిస్తాన్ ఆర్మీ కవాతు.. పాక్‌లో పరిస్థితి ఇదే..!

యుద్ధానికి మేం వెనకాడబోమని పాకిస్తాన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం భారత సరిహద్దు లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహించింది. పాకిస్తాన్ సాయుధ దళాలు రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, చైనీస్ హోవిట్జర్లలను సరిహద్దు వెంట కవాతు చేసి మోహరించాయి.

author-image
By K Mohan
New Update
Pakistan forces drills

యుద్ధానికి మేం వెనకాడబోమని పాకిస్తాన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం భారత సరిహద్దు లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహించింది. పాకిస్తాన్ సాయుధ దళాలు రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, చైనీస్ హోవిట్జర్లలను సరిహద్దు వెంట మోహరించాయి. పాకిస్తాన్ సైన్యం రాజస్థాన్‌లోని బర్నర్‌లోని లాంగేవాలా సెక్టార్‌కు ఎదురుగా రాడార్ వ్యవస్థలు, ఎయిర్ ఫోర్స్ ఆయుధాలను మోహరించింది. ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్‌లోని లాహోర్, కరాచీ మీదుగా విమానాలు ఎగరడాన్ని నిషేధించింది. 

Also read: పాక్‌కు మరో BIG షాక్: 1971లో ఇందిరమ్మ చేసింది.. ఇప్పుడు మోదీ చేయబోతున్నారా..?

సరిహద్దుల వెంబడి ఆర్మీ హెలికాఫ్టర్లు పహారా కాస్తున్నాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం ఒకేసారి 3 విన్యాసాలను నిర్వహిస్తోంది. వీటికి ఫిజా-ఎ-బదర్, లాల్కర్-ఎ-మోమిన్, జర్బ్-ఎ-హైదరీ అని పేరు పెట్టారు, వీటిలో F-16, J-10, JF-17 సహా అనేక ఫైటర్ జెట్లు పాల్గొంటాయి. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునిర్ టిల్లా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ను పరిశీలించారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన మంగళా స్ట్రైక్ కార్ప్స్ గురువారం హామర్ స్ట్రైక్ సైనిక విన్యాసం నిర్వహించింది.

Also read: BIG BREAKING: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!

(pakistan-army | parade | Line of Control | india pak war | india pak war news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు