/rtv/media/media_files/2025/10/23/ai-content-labelling-2025-10-23-21-13-01.jpg)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేస్తున్న 'డీప్‌ఫేక్' వీడియోలు, ఫొటోలు దేశంలో రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులకు సంబంధించిన తప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ డీప్‌ఫేక్‌లు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడమే కాక.. వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి.
The Ministry of Electronics and Information Technology (MeitY) has proposed amendments to the Information Technology Rules to make clear labelling of content generated through artificial intelligence mandatory.
— Live Law (@LiveLawIndia) October 23, 2025
Read more: https://t.co/lnAIWabrWB#artificialintelligence… pic.twitter.com/WEfQfPOAK2
ఈ పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి, ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా క్రెడిబిలిటీ కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా, ఏఐ (AI) ఉపయోగించి సృష్టించిన కంటెంట్‌కు లేబులింగ్‌ను తప్పనిసరి చేసే దిశగా నిబంధనలను రూపొందిస్తోంది. అంటే, ఏఐ ద్వారా రూపొందించిన ప్రతీ వీడియో లేదా చిత్రంలో, అది కృత్రిమ మేధ ద్వారా తయారైందని స్పష్టంగా తెలిపే "ఏఐ జెనరేటెడ్" అనే లేబుల్ ఉండాలి.
ప్రస్తుత ఐటీ నిబంధనలు, 2021 ప్రకారం, ఆన్‌లైన్ వేదికలు అక్రమ కంటెంట్‌ను తొలగించాలి. డీప్‌ఫేక్‌ల విషయంలోనూ, అవి నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేస్తే లేదా ఇతరులను అనుకరిస్తే వాటిని గుర్తించి తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు ప్రభుత్వం సలహా ఇచ్చింది. అయితే, కేవలం తొలగించడం మాత్రమే కాకుండా, ముందస్తు నివారణ కోసం కంటెంట్ లేబులింగ్ విధానాన్ని తీసుకురావడం అత్యంత కీలకం. త్వరలో ఈ కొత్త నిబంధనలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. డీప్‌ఫేక్ కంటెంట్‌ను అరికట్టడానికి సాంకేతిక, చట్టపరమైన నియమాలను కఠినతరం చేయాలని పార్లమెంటరీ కమిటీ కూడా సూచించింది. డీప్‌ఫేక్‌లు వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రత, ప్రజాస్వామ్య ప్రక్రియలపై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో, AI కంటెంట్ లేబులింగ్ తప్పనిసరి చేయడం ఈ ముప్పును ఎదుర్కోవడంలో ముఖ్యమైన మొదటి అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Follow Us