Pakistan: యుద్ధానికి దిగితే పాకిస్తాన్ చిన్నాభిన్నం.. ఆ దేశం అప్పులెన్నో తెలుసా?

పాక్ భారత్‌తో యుద్ధం విషయంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. దేశ ఆర్ధిక పరిస్ధితి అప్పుల్లో ఉంది. పాకిస్థాన్‌ అప్పులు పాక్‌ రూపాయల్లో 70.36 ట్రిలియన్లు (భారత కరెన్సీలో రూ.21.15 లక్షల కోట్లు). ఆ దేశ జీడీపీ గ్రోత్ రేట్ కూడా 2.38 శాతం మాత్రమే.

New Update
pakistan economy

పాకిస్తాన్ భారత్‌పై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తినడానికి తిండిలేదు గానీ యుద్ధానికి కాలు సిద్ధమవుతుంది. భారత్‌తో పోల్చుకుంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అంతగా ఏమి బాలేదు. యుద్ధానికి దిగితే పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుందని ఫైనాన్షియల్ కంపెనీ మూడీస్ రేటింగ్స్ అభిప్రాయపడింది. కొవిడ్ తర్వాత పాకిస్తాన్ ఎకానమీ పూర్తిగా కుదేలైంది. పాకిస్తాన్‌ ఇప్పటికే అప్పు్ల్లో కూరుకుపోయింది. పాక్ వద్ద 15 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండగా..  భారత్‌ దగ్గర 688 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయి. ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే పాకిస్తాన్ రూపాయి విలువ కూడా తక్కువే.. మన ఒక్క రూపాయి పాకిస్తాన్ మూడు రూపాయిలతో సమానం.

పాకిస్థాన్‌ మొత్తం రుణం పాక్‌ రూపాయి(పీకేఆర్‌)ల్లో 70.36 ట్రిలియన్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.21.15 లక్షల కోట్లు). ఆ దేశ జీడీపీ గ్రోత్ రేట్ కూడా 2.38 శాతం మాత్రమే. అదే మన ఇండియాది 6.7శాతం. డెవలప్‌పింగ్ కంట్రీస్‌లో ఇండియా ముందంజలో ఉంది. భారతదేశ GDP 2025లో  రూ.361 లక్షల కోట్లకు చేరుకుంటుందని, ఇది జపాన్ GDP కంటే ఎక్కువ అని అంచనా. భారతదేశ తలసరి GDP 2014లో 1560 డాలర్ల ఉండగా.. 2024 నాటికి 2,711 డాలర్లకి పెరిగింది. గత 10 సంవత్సరాలలో ఇది 74% పెరిగింది. పాకిస్తాన్ తలసరి జీడీపీ మాత్రం 2014లో 1424డాలర్లు ఉండగా.. 2024లో కేవలం 1,581 డాలర్లకి పెరిగింది. ఇది కేవలం 11% వృద్ధి మాత్రమే. 

కరోనా తర్వాత పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. 50 ఏళ్ల క్రితం దక్షిణాసియాలో అత్యంత సంపన్న దేశంగా ఉన్న పాకిస్తాన్, పాలన బాగోలేకపోవడం, సైనిక నియంతృత్వాలు, టెర్రరిజాన్ని స్టేట్ పాలసీగా ప్రోత్సహించడం వల్ల అత్యంత పేద దేశంగా మారింది. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపడం, బలుచిస్తాన్‌లో తిరుగుబాటు, దివాలా భయంతో రాజకీయ గందరగోళం ఎదుర్కొంది. పాకిస్తాన్‌కు భారత్‌తో యుద్ధం చేసే సత్తా లేదు. ఈ దేశ ఎకానమీ దివాలా అంచులకు జారుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.  కరోనా తర్వాత దాని ఎకానమీ కుప్పకూలింది. ఇప్పటికీ  లోన్స్ పై ఆధారపడి నడుస్తోంది. భారత్‌తో సైనిక సంఘర్షణ, చిన్నదైనా, నియంత్రించే స్థాయిలో  ఉన్నా, పాకిస్తాన్ ఎకానమీ మరింత కుప్పుకూలుతుందనడంలో సందేహం లేదు. 

క్లైమేట్ రెసిలియన్స్ లోన్ ప్రోగ్రామ్ కింద 1.3 బిలియన్ డాలర్లు  (రూ.11 వేల కోట్లు) , బెయిలవుట్ కింద 7 బిలియన్ డాలర్ల (రూ.60 వేల కోట్ల) ను పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పుగా ఇవ్వాలని ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

pakistan | india pak war | big twist In India Pak War | India Pak War Latest | india | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు