/rtv/media/media_files/2025/04/27/aBeHpKWgfo6kgl2MoAu9.jpg)
pak ind Photograph: (pak ind)
Pahalgam Attack: పహల్గాం అటాక్ నేపథ్యంలో అటారి సరిహద్దు వద్ద ఓ భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో పాక్ పౌరులు తరలివెళ్తుండగా ఓ తల్లికి ఇండియా, ఆమె ఇద్దరు పిల్లలకు పాక్ పాస్ పోర్టులున్నాయి. దీంతో తల్లిని వీడలేక పిల్లలు, పిల్లలను వీడలేక తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దృశ్యం అందరినీ కదిలించగా దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.
ఈ రోజే చివరి గడువు..
ఈ మేరకు జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పౌరులను తిరిగి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగియనుంది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ పౌరులు అటారి సరిహద్దుకు చేరుకుంటున్నారు. ఇందులో భాంగంగానే అటారి సరిహద్దు వద్ద ఒక తల్లి, ఇద్దరు పిల్లల ఎమోషనల్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఇది అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. తల్లికి భారతీయ పాస్‌పోర్ట్ ఉండగా ఆమె కూతురు (8), కొడుకు (6)కు పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ఉంది. దీంతో తమ పిల్లలను వీడి ఉండలేక కన్నీటిపర్యంతమయ్యారు. కూతురు ఏడుస్తూ 'అమ్మ లేకుండా ఉండలేము' అని ఏడవటం అందరి హృదయాలను కదిలించింది.
తల్లి ఇండియా.. పిల్లలు పాకిస్థాన్..
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నివాసి అయిన ఆ మహిళ 10 సంవత్సరాల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమెకు భారతీయ పాస్‌పోర్ట్ ఉండగా పిల్లలకు పాకిస్తాన్ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. అయితే ఇటీవల అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలవడానికి ఆమె ఢిల్లీకి వచ్చింది. కానీ పహల్గామ్ దాడి తర్వాత ఆమెను, ఆమె పిల్లలను వెంటనే పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లాలని ఆదేశించారు. దీంతో పిల్లలతో కలిసి పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లేందుకు అటారి సరిహద్దుకు చేరుకుంది. అయితే ఆమెకు భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నందున పాకిస్తాన్ వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో అధికారులు ఆపేశారు. మరోవైపు పిల్లలను పాకిస్తాన్ వెళ్ళడానికి అనుమతించారు. ఈ పరిస్థితి ఆ కుటుంబాన్ని మానసికంగా కుంగదీయగా మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
ఇక మరో 81 ఏళ్ల వృద్ధురాలు పాకిస్తాన్‌కు తిరిగి వెళుతూ.. 'పహల్గాంలో జరిగింది తప్పు. అందుకే మేము మౌనంగా ఉన్నాం. వారిని శిక్షించాలి. నేను ఇక్కడికి వచ్చి రెండు నెలలు అయింది. అట్టారి సరిహద్దులో ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వారి సభ్యులకు వివిధ దేశాల పౌరసత్వం , పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఈ దృశ్యాలు ఒక కుటుంబం పడుతున్న బాధను వర్ణించడమే కాకుండా భారతదేశం, పాకిస్తాన్ సరిహద్దులో విభజించబడిన హృదయాల విషాదాన్ని కూడా హైలైట్ చేస్తాయని ఎమోషనల్ అయింది.
Also Read : Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!
ind-vs-pak | attack in Pahalgam | telugu-news | today telugu news