Bunny: బన్నీ పై ఎవరికో ద్వేషం ఉంది.. వైరల్ అవుతున్న వేణుస్వామి వీడియో! బన్నీపై ఎవరికో ద్వేషం ఉందని ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదని వేణుస్వామి అన్నారు. బన్నీ ఏం తప్పు చేశాడని అతనిని టార్గెట్ చేస్తున్నారంటూ వేణుస్వామి ఎప్పుడో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. By Bhavana 14 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Allu Arjun: జాతీయ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో అటు సినీపరిశ్రమ నుంచే కాకుండా రాజకీయ నేతల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ అరెస్ట్ గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని బన్నీ అరెస్ట్ విషయంలో తన జోక్యం లేదని చెప్పుకొచ్చారు.సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని రేవంత్ చెప్పుకొచ్చారు. Also Read: Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన అయితే ఇదే సమయంలో వేణుస్వామి ఓ ఇంటర్వ్యూలో భాగంగా చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బన్నీ ఏం తప్పు చేశాడని అతనిని టార్గెట్ చేస్తున్నారని వేణుస్వామి అన్నారు. మూడు నెలల నుంచి బన్నీని టార్గెట్ చేస్తున్నారని వేణుస్వామి అన్నారు. బన్నీపై ఎవరికో ద్వేషం ఉందని ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదని వేణుస్వామి వెల్లడించడం గమనార్హం. Also Read: నేడు అల్లు అర్జున్ విడుదల..జైలు వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు! బన్నీ పాన్ ఇండియా స్టార్ అని నేను చేసిన కామెంట్లను సైతం ఒక టీవీ ఛానల్ అరగంట డిబేట్ పెట్టి వేణుస్వామి బన్నీ పాన్ ఇండియా స్టార్ అని చెప్పాడని కాబట్టి బన్నీ జీవితం నాశనం అవుతుందని ప్రోగ్రామ్ చేశారని ఆయన తెలిపారు. బన్నీనే ఓ రేంజ్ లో ఆట ఆడుకుంటున్న నేపథ్యంలో నేనెంత అని వేణుస్వామి వెల్లడించారు.ఓడలు బండ్లు కావడం బండ్లు ఓడలు కావడం సాధారణం అని ఆయన పేర్కొన్నారు. Also Read: Allu Arjun: రాత్రంతా జైలులో కింద పడుకున్న బన్నీ! వేణుస్వామి గతంలో చేసిన కామెంట్లు ప్రస్తుతం సంచలనంగా మారాయి. చట్టం ముందు సెలబ్రిటీలు ప్రత్యేకం కాదని బన్నీ అరెస్ట్ తో మరోసారి ప్రూవ్ అయింది.సెలబ్రిటీల విషయంలో పోలీసులు ఉపేక్ష చూపించరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ నేపథ్యంలో విచారణ జరుగుతోందని తెలుస్తోంది. బన్నీ అరెస్ట్ ఊహించని పరిణామమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బన్నీ అరెస్ట్ నేపథ్యంలో, తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇకపై బెనిఫిట్ షోలు సైతం రద్దు అవ్వనున్నాయనే టాక్ నడుస్తుంది. Also Read: బన్నీకి బెయిల్ ఇచ్చిన లాయర్ ఎవరు? వామ్మో గంటకు ఇంత ఫీజు హా? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి