ఈ దీవిపై ఇజ్రాయెల్ దాడుల చేస్తే.. చమురు ధరలు గాల్లోకే ఇరాన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ అనే చిన్నదీవి ఉంది. ఇక్కడి నుంచే పెట్రో ఎగుమతులు జరుగుతాయి. ఒకవేళ ఇజ్రాయెల్ దీనిపై దాడులు చేస్తే.. చమురుధరలు 5 శాతం పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 13 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇజ్రాయెల్- ఇరాన్ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం ఇరాన్.. ఇజ్రాయెల్ దాదాపు 200 క్షిపణులతో దాడి చేయడం సంచలనం రేపింది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్‌పై పగతో రగిలిపోతోంది. ప్రతీకార దాడులు తప్పవని కూడా హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు సైనిక అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇరాన్‌పై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. Also Read: అతి పెద్ద రాకెట్..స్టార్ షిప్ ప్రయోగం విజయవంతం మరోవైపు ఇరాన్ కూడా తగ్గేదే లేదంటోంది. తమపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే తిప్పి కొడుతామని హెచ్చరించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఇజ్రాయెల్ కౌంటర్‌కు అటాక్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. అయితే ఇరాన్‌లో ఉన్న అణుకేంద్రాలపై దాడులు చేయొద్దని సూచనలు చేశారు. అటు అమెరికా యుద్ధదళాలు సైతం మధ్యధరా సముద్రంలో, అలాగే పర్షియన్ గల్ఫ్‌లో కూడా అలెర్ట్‌గా ఉంటున్నాయి. ఎప్పుడు పరిస్థితులు తీవ్రతరమైనా వాటిని ఎదుర్కొనేందుకు ఈ దళాలు సిద్ధంగా ఉన్నాయి. దీవిపై దాడులు జరిగితే ? అయితే పర్షియన్ గల్ఫ్‌లోని ఇరాన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ అనే చిన్నదీవి ఉంది. ఇది ఆ దేశానికే ఆయువు పట్టులాంటింది. ఈ ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పెట్రో ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలోనే పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనాకు కూడా ఇక్కడి నుంచే పెట్రోలియం సరఫరా జరుగుతుంది. ఒకవేళ ఇజ్రాయెల్ దీన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తే.. చమురుధరలు 5 శాతం పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతంలో కూడా ఇరాన్-ఇరాక్ మధ్య జరిగిన యుద్ధంలో సద్దాం హుస్సేన్ గ్రూప్ ఈ దీవిపై దాడులకు పాల్పడ్డాయి. Also read: అక్టోబర్ 7కు హమాస్ చాలా పెద్ద కుట్రే చేసింది–వాషింగ్టన్ పోస్ట్ అలా జరిగితే చమురు సంక్షోభమే ఈ ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన పలు దీవుల ద్వారా చమురు వివిధ దేశాలకు ఎగుమతి అవుతోంది. పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఇతర దేశాలైన కువెట్, ఇరాక్, సౌదీ అరేబియా, బహ్రయిన్, ఖతార్ దేశాలకు చెందిన చమురు ఎగుమతి టెర్మినల్స్ సైతం ఈ తీరప్రాంతంలోనే ఉన్నాయి. హెర్ముజ్ జలసంధి నుంచే పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అయితే జలసంధి విస్తీర్ణం చూసుకుంటే ఎక్కువభాగం ఇరాన్ ఆధీనంలోనే ఉంటుంది. అయితే ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే.. ప్రపంచంలో చమురు సంక్షోభం నెలకొంటుంది. #telugu-news #israel #iran #petrol మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి