USA Firing: న్యూక్ ఇండియా, కిల్ ట్రంప్..పిల్లలపై కాల్పుల జరిపిన కిల్లర్ గన్ పై రాతలు

అమెరికాలోని మినియాపోలిస్ సిటీలో స్కూల్ పై దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు పిల్లలు చనిపోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఇదొక ఉగ్రవాద చర్య అని ఎఫ్బీఐ చెబుతోంది. దాంతో పాటూ అతని ఆయుధాలపై షాకింగ్ రాతలు కనిపించాయి. 

New Update
firing

Westman, 23, used three weapons - a rifle, a shotgun and a pistol

మినియాపోలిస్ లో కాథలిక్ స్కూల్ లో కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో కాల్పుల జరిపిన వ్యక్తి కూడా ఉన్నాడు.  దుండగుడు చర్చి వెనుక నుంచి షూటింగ్ చేశాడు. ఇందులో 8, 10 ఏళ్ళు గల ఇద్దరు పిల్లలు మృత్యువాతన పడ్డారు. కాల్పులు జరిపిన తర్వాత కిల్లర్ కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు. గాయపడిన మరి కొందరి పిల్లల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. దుండగుడు 22 ఏళ్ళ ట్రాన్స్ జెండర్ అని అధికారులు గుర్తించారు. ఇతను తన దగ్గర ఉన్న ఆయుధాలతో విచక్షణా రహితంగా డజన్ల రౌండ్ల కొద్దీ కాల్పులు జరిపాడని చెబుతున్నారు. 

ఆయుధాలపై అడ్డమైన రాతలు...

ఉదయం స్కూల్లో విద్యార్థులను దింపే సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల జరిపిన వ్యక్తి 22 ఏళ్ళ రాబిన్ వెస్ట్మన్ గా గుర్తించారు. 2020లో పురుషుడి నుంచి మహిళగా లింగమార్పిడి చేసుకుని.. పేరు కూడా రాబర్ట్ నుంచి రాబిన్‌గా  మార్చుకున్నాడు. ఇతని దగ్గర ఒక రైఫిల్ తో పాటూ షాట్ గన్, పిస్టల్ కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దాంతో పాటూ మరికొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దుండగుడు వాడిన ఆయుధాలపై ట్రంప్ ను చింపేయండి. న్యూక్ ఇండియా, ఇజ్రాయెల్ మస్ట్ ఫాల్, బర్న్ ఇజ్రాయెల్, వేర్ ఈజ్ గాడ్, ఫర్ ది చిల్డ్రన్ అనే రాతలు కనిపించాయి.  వీటిని చూసి అధికారులు షాక్ అయ్యారు. కాల్పుల ఘటనను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.

మరోవైపు కాల్పులకు ముందే దానికి సంబంధించి యూట్యూబ్ లో పోస్ట్ పెట్టినట్టు చెబుతున్నారు. తుపాకులు, మ్యాగజైన్‌లు, మేనిఫెస్ట్‌ను చూపించే 11 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.  ఇదే వీడియోలో రెండు పుస్తకాలను కూడా నిందితుడు చూపించాడు. ఇందులో చాలా రాసి ఉంది. అయితే రాబిన్ కు ఇంతకు ముందు నేర చరిత్ర ఏమీ లేదని..ఇప్పుడు కూడా ఒంటరిగానే ఈ కాల్పులకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. మానసిక అనారోగ్యం కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అంచనా వేస్తున్నారు. 

Also Read: Market Crash: స్టాక్ మార్కెట్ పై ఇంకా టారిఫ్ ల ఎఫెక్ట్..ఈరోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీలు క్రాష్

Advertisment
తాజా కథనాలు