Market Crash: స్టాక్ మార్కెట్ పై ఇంకా టారిఫ్ ల ఎఫెక్ట్..ఈరోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీలు క్రాష్

ట్రంప్ అదనపు సుంకాల ఎఫెక్ట్ మూడు రోజులుగా భారత స్టాక్ మార్కెట్ ను కుదేలు చేస్తున్నాయి. ఈరోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా క్రాష్ అయ్యాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పతనమవ్వగా.. నిఫ్టీ 24,600 దిగువకు పడిపోయింది.

New Update
stock market losses

ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు భారత స్టాక్ మీద విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా విధించిన అదనపు సుంకాల కారణంగా మూడు రోజులుగా మార్కెట్ క్రాష్ అవుతూనే ఉంది. ఈ రోజు కూడా పరిస్థితిలో మార్పు లేదు.  దీంతో ఈరోజు సెన్సెక్స్ 600 పాయింట్లు పడిపోయి 80,150 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా 200 పాయింట్లు పడిపోయి..4,600 దిగువకు చేరుకుంది. US డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు పెరిగి 87.53కి చేరుకుంది. రష్యా చమురు కొనుగోలు చేయద్దంటూ అమెరికా విధించిన ఆంక్షల కారణంగా చమురు ధరలు బాగా పడిపోయాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు $68 కంటే తక్కువగా పడిపోయింది, అయితే WTI $64 దగ్గర ఉంది.

30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 20 నష్టపోగా.. 10 లాభాల్లో ఉన్నాయి. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్,  HCLTech షేర్లు 1.6% వరకు నష్టపోయాయి. జొమాటో, బజాజ్ ఫైనాన్స్,  HUL లాభాల్లో ఉన్నాయి. ఇక నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 32 స్టాక్‌లు నష్టపోగా.. 18 లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈరోజు అన్ని NSE సూచీలు నష్టపోయాయి. ఐటీ, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ అత్యధికంగా నష్టపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా క్షీణత..

ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 0.50% పెరిగి 42,731 వద్ద, కొరియా కోస్పి 0.52% పెరిగి 3,203 వద్ద ట్రేడవుతున్నాయి.
హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.66% తగ్గి 25,035 వద్ద ఉండగా, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.072% పెరిగి 3,803 వద్ద ఉంది. మరోవైపు అమెరికా మార్కెట్లలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది. ఆగస్టు 27న, US డౌ జోన్స్ 0.32% పెరిగి 45,565 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.21% మరియు S&P 500 0.24% పెరిగాయి. ఆగస్టు 26న విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నగదు విభాగంలో రూ.6,516.49 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) రూ.7,060.37 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.

Also Read: F1, J1 Visa Rules: అమెరికాలో విద్యార్థులు, ఉద్యోగులపై మరో బాంబ్..వీసా పరిమితి కుదింపు

Advertisment
తాజా కథనాలు