/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
అమెరికాలో హెచ్ 1 బీ కాకుండా వచ్చే మిగతా వీసాల వారు అక్కడ వర్క్ చేయాలంటే ప్రత్యేక పర్మిట్ పొందాలి. దాన్ని EAD అంటారు. హెచ్ 1బీ డిపెండెంట్లుగా వచ్చే వారు ఎక్కువగా దీని కోసం అప్లై చేస్తారు. EAD తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటారు. ఇంకా చాలా వీసాల వాళ్ళు కూడా ఈ వర్క్ పర్మిట్ లను తీసుకోవాల్సిందే. ఇప్పుడు ట్రంప్ సర్కార్ వీటిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై EAD లను ఆటో మాటిక్ గా రెన్యువల్ చేయమని ప్రకటించింది. దీనికి సంబంధించి యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ ప్రకటన జారీ చేసింది.
భారతీయులకు పెద్ద దెబ్బ..
యూఎస్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది విదేశీ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా అతి ఎక్కువగా భారతీయులకు ఇది పెద్ద దెబ్బ కానుంది. ఎక్కువ మంది ఇండియన్స్ అమెరికాలో హెచ్ 4 మీద ఉన్నారు. హెచ్ 1బీ వీసా మీద వచ్చే వారి లైఫ్ పార్టనర్స్ అందరూ డిపెండెంట్ హెచ్ 4 వీసాల మీద వస్తారు. వీరందరూ అమెరికాలో వర్క్ చేయాలంటే EAD తీసుకోవాల్సిందే. కంపెనీలు వారికి ప్రత్యేకంగా హెచ్ 1బీ చేయిస్తే ఓకే కానీ..లేకపోతే వర్క్ పర్మిట్ తీసుకుని ఉద్యోగాలు చేయాలి. డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ ఈ వర్క్ పర్మిట్లను సాధారణంగా నాలుగు నుంచి ఆరు నెలలకు ఇస్తుంది. ఆ తరువాత అవి రెన్యూవల్ అవుతుంటాయి. ఇప్పటి వరకు ఇవి ఆటోమాటిక్ గా రెన్యూవల్ అవుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు అలా అవదని ట్రంప్ గవర్నమెంట్ చెప్పేసింది. దీంతో ఇక మీదట ప్రతీసారీ EAD ని కొత్తగా అప్లే చేసుకుంటూ పోవాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. పైగా అప్లై చేసిన ప్రతీసారీ ఇవ్వాలని రూల్ కూడా ఉండదు. వర్క్ పర్మిట్ లేకపోతే పని చేయడం కుదరదు. దీని కారణంగా ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు గందరగోళంలో పడనున్నాయి.
ఈ కొత్త రూల్ ను ఇమ్మిడియట్ గా రేపటి నుంచే అంటే అక్టోబర్ 30 నుంచే అమలు చేయనున్నారు. అంతేకాదు ఇక మీదట ఎవరు వర్క్ పర్మిట్ను అప్లై చేసుకున్నా తనిఖీలు, స్క్రీనింగ్ చేస్తామని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ తెలిపింది. వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసే లోపునే మళ్ళీ అప్లే చేసుకోవచ్చని చెప్పింది.
Also Read: Melisa Hurricane: మెలిసా హరికేన్ తాండవం..30 మంది మృతి
Follow Us